calender_icon.png 21 August, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

21-08-2025 01:03:37 AM

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి

రాజాపూర్ ఆగస్టు 20: పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తుందని ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. బుధవారం రాజాపూర్ మండల కేంద్రంలో ని జేకే పంక్షన్ ప్యాలెస్ లో ఏ ర్పాటు చేసిన సమావేశంలో మండలంలో కొత్తగా వచ్చిన 433 రేషన్ కార్డులు,1667 పాత కార్డులకు ఆడిషన్స్ పూర్తి చేసిన కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.

15 మందికి కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలో రూ. 30 లక్షలతో వేస్తున్న సిసి రోడ్డు, అండర్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని మల్లెపల్లి గ్రామంలో రూ.32 లక్షల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు పనులను, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ, అంగన్ వాడి భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.

కుచర్ కల్ గ్రామంలో రూ.60 లక్షల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణనికి శంకుస్థాపన చేశారు. తిర్మలపూర్ గ్రామంలో రూ.22.50లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. చెన్నవేల్లి గ్రామంలో రూ.15లక్షల తో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఈ ప్రభుత్వానికి పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యంమనిఅన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందిస్తున్నమాని అన్నారు.

ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్ర ధాన ద్యేయం అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రజలను పేదల భూ ములు లాక్కుని వెంచర్లు చేశారని మండిపడ్డారు. ఎక్కడ భూములు కొంటె అక్కడ మాత్రమే రో డ్లు వేశారని తెలిపారు.

డిసెంబర్ తర్వాత నియోజకవర్గంలో రెండో విడత పాదయాత్ర చేస్తానన్నారు. ఏ గ్రామంలో సమస్యలు ఉంటే అక్కడే ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని తెలి పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాధాకృష్ణ, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపిఓ వెంకట్రాము లు,డిప్యూటీ తసీల్దార్ భారతి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్,గోవర్ధన్ రెడ్డి, యా దయ్య,శ్రీనివాస్ నాయక్ ,గిరిధర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, రమేష్,సాయి కుమార్, రమణ, నసిర్ బేగ్,రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.