ఊరటకే ఎందుకింత ఉబలాటం
జూకంటి జగన్నాథం :
* తెలంగాణ పేరు మీద నాయకుడు, వారి కుటుంబ సభ్యులు నిరాటంకంగా చేసిన ఆర్థిక విధ్వంసం ఇంతా అంతా కాదు. కొంతమంది అమీబా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మేధావులు ఇదంతా పెద్దాయనకు తెలియకుండా జరిగిందని ఆశ్చర్యక రంగా సమర్థిస్తుంటారు.
సాంకేతిక కారణాల దృష్ట్యా న్యాయస్థానాలు తాత్కాలి క ఊరట కల్పించినంత మాత్రాన భుజాలు చరుచుకొని ఉబలాటపడి ఉత్సాహపడిన్నంత మాత్రాన అవినీతి, అక్రమాలు చేసిన దోషులు తెల్లారి లేచేసరికి నిర్దోషులై పోతామని అనుభూతి చెంది, భ్రమ పడితే, ఏ మాత్రం ప్రాసంగికత లేని అంశంగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కవి మిత్రుడు అలిశెట్టి ప్రభాకర్ సిటీ లైఫ్ లో వకీళ్ల గురించి వ్యంగ్య కవిత రాశాడు
“ఏ కీలు
ఆ కీలు
విరిచే వాడే వకీలు”
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ, దాని పాలకులు లేక నాయకులు 2023 నవంబర్ వరకు దాదాపు పది సంవత్సరాలు ఎదురులేకుండా రాష్ట్రాన్ని ఏలినా రు. ఎవరి అంచనాలకు అందని విధంగా 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికలలో మితిమీరిన ఆనాటి అధికార పార్టీ అహంకార ధోరణికి ప్రజలు విసిగి ఎన్నికలలో తగి న గుణపాఠం, బుద్ధి చెప్పారు. తెలంగాణ ప్రజలకు అవకాశం రాగానే అంచనాలను అందని విధంగా ఫలితాలు వచ్చినాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
ఈ సందర్భంగా అలిశెట్టి ప్రభాకర్ రాజకీయ నాయకుల గురించి చెప్పిన మాటలను ఉటంకించడం సముచితంగా ఉంటుందని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
ఇదివరకు
సమాజం శరీరం మీద గీరుకుపోయే
చిన్న రౌడీ ‘బ్లేడు’
ఇవాళ
ఇంటింటికి చేతులు జోడించి
ఎన్నికల్లో మెరిసే ఎమ్మెల్యే ‘చాకు’
రేపు
అరాజకీయాల్లో ఆరితేరి
కాబోయే మంత్రి ‘గండ్ర గొడ్డలి’
వివిధ ప్రాంతాలలో ఎన్నికల ప్రచార సభలలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రి యాంక గాంధీ, సోనియా గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా గత ప్ర భుత్వం పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతిపైన దర్యాప్తు చేసి నిధులను రాబడతా మని చెప్పారు.
వాగ్దానం చేసిన విధంగానే అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై మాజీ న్యాయమూర్తి పీసీ ఘో ష్ నేతృత్వంలో దర్యాప్తు కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విద్యుత్తు కొనుగోళ్లపై మరో జ్యుడీషియల్ కమిషన్ వేసింది. ఈ-కార్ రేస్‌పై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా కమిషన్లు తమ దర్యాప్తు నివేదికలను సమ ర్పించాయి. రాష్ట్ర క్యాబినెట్ ఆ నివేదికలను ఆమోదించింది కూడా. జస్టిస్ ఘోష్ రిపోర్టు ఆధారంగా తగు చర్యల తీసుకోవాలని ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. నివేదికలో పేర్కొన్న నిందితులు రా ష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
కొన్ని సాంకేతిక కారణాల వలన గత ముఖ్యమంత్రి కేసీ ఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులను సాక్షులుగా పిలిచి, వారిని నిందితు లుగా పేర్కొంటూ చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫారసు చేసింది. ఆ నివేదికను రాష్ట్ర హైకోర్టులో సవాలు చేసి వారు ఊరట పొందారు. అదే సమయంలో రాష్ట్ర హైకో ర్టు ధర్మాసనం జస్టిస్ ఘోష్ కమిషన్‌కు చట్టబద్ధత ఉన్నదని తమ ఉత్తర్వుల్లో తేల్చిచె ప్పడం గమనించవలసిన విషయం.
అయితే లక్షలాది రూపాయల ఫీజులు వెచ్చించి జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతు లు ఉన్న పెద్ద న్యాయవాదులను సదరు నాయకులు నియమించుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తాలు చెల్లించి పేరుమోసిన వకీళ్లను నియమించుకోవడం సామాన్య ప్రజలతో సాధ్యమయ్యే పని కాదు. సాంకేతిక కారణాల దృష్ట్యా తాత్కాలిక ఊరట దొరికినప్పటికీ సదరు నాయకులందరినీ అమాయకులు, నైతిక విలువలు కలిగిన మహానేతలు అని ప్రజలు నమ్మే, విశ్వసించే అవకాశం కించిత్తు కూడా లేదు.
ఏదేమైనప్పటికి తెలంగాణ పౌర సమా జం జాగరూకతతో నిరంతరం నిశ్శబ్దంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు ఈ సమాజం తన శక్తి సామర్థ్యాలను, యుక్తులను, శక్తులను అనూహ్యంగా ప్రదర్శిస్తాయని ఎన్నోసార్లు నిరూపితమైంది.
గత పాలకులు 2014 నుంచి, ఆ మాట కు వస్తే టీఆర్‌ఎస్ ప్రారంభమైన 2001 నుంచి వారి వారి ఆస్తులు ఎలా వృద్ధిచెందాయో నమూనాకు ఆయా ఎన్నికల సంద ర్భాలలో వారి అఫిడవిట్లను పరిశీలిస్తే కళ్లు చెదిరిపోయే నిజాలు తెలుస్తాయి.
తెలంగాణ పేరు మీద నాయకుడు, వారి కుటుంబ సభ్యులు నిరాటంకంగా చేసిన ఆర్థిక విధ్వంసం ఇంతా అంతా కాదు. దీన్ని కొంతమంది అమీబా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మేధావులు ఇదంతా పెద్దాయనకు తెలియకుండా జరిగిందని ఆశ్చర్యక రంగా సమర్థిస్తుంటారు. తెలంగాణ ప్రజలు అమాయకులని వీరు, వీరి నాయకులు భావిస్తుంటారు. కనీసం ఇప్పటికీ తమ పదేళ్ల పరిపాలనలో జరిగిన తప్పొప్పులను సమీక్షించుకోవడం గాని, అంతర్మమథనం చేసు కోకపోవడం గాని చేయడం లేదు.
పైగా తా ము ఎన్నికలలో ఓటమి చెందడానికి ప్రజల తప్పిదమే కారణమని పైనుంచి మొ దలు కింది వరకు ఉన్న చిన్నాచితక నాయకుల వరకు ఇప్పటికీ మాట్లాడడం చూస్తుం టే వారి సామాజిక అహంభావానికి, అహంకారానికి నిదర్శనంగా నిశానిగా కనిపిస్తుంది. కాకపోతే ఆయా నాయకులు చేస్తున్న వ్యా ఖ్యానాలను లోతుల్లోకి వెళ్లి విశ్లేషిస్తే తమ వద్ద పెద్ద మొత్తంలో ఉన్న సంపదకు సంకేతంగా భావించాల్సి వస్తుందని రాజకీయ మనో విశ్లేషకులు అంటున్నారు.
చివరిగా ఏదేమైనా న్యాయస్థానాలకు చిక్కకపోవడం వలన అవినీతి, అక్రమాలు సక్రమాలు నీతిమంతమవుతాయని అనుకుంటే దానికన్నా తెలివి మీరిన పని మరొక టి కాదు. ఎన్నికలలో గెలుపోటములకు ప్ర త్యామ్నాయంగా ప్రజాక్షేత్రం ఒకటి ఉంటుందని గమనంలోకి తీసుకుంటే నాయకులకు ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే కుక్క తోక పట్టుకొని గోదావరి దాటడంలా చుట్టూ పరిభ్రమించాల్సి వస్తుంది.
వ్యాసకర్త: కవి, రచయిత






