07-10-2025 12:12:47 AM
పాలూరు రామకృష్ణయ్య :
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఎలా వచ్చాయి. ఈ 42 శాతానికి చట్టబద్దత ఉందా? అని ఆలోచి స్తే చట్ట బద్ధత ఉందనే చెప్పుకోవాలి. అందుకు భారతదేశ పాలన కు దిక్సూచి అ యిన రాజ్యాంగాన్ని ఒకసారి పరిశీలిద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు మొదటి నుంచి ఉన్నాయా అంటే లేవనే చెప్పొచ్చు. మరి స్థానిక సంస్థల్లో, పురపాలక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎప్పడు వచ్చాయంటే .. ప్రధాని పీవీ హయాంలో ఆర్టికల్ 243 డి (6), ఆర్టికల్ 243 టి (6) కింద 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వా రా అమల్లోకి వచ్చాయి.
ఆర్టికల్ 243 డి(6) ప్రకారం.. రాష్ర్ట శాసనసభలు ఓబీసీ పౌరుల కోసం పంచాయతీలలోని సీట్లను, ఛైర్‌పర్సన్ పదవులను రిజర్వ్ చేయడానికి నిబంధనలు చేయవచ్చని పేర్కొంది. ఈ ని బంధన పంచాయతీరాజ్ సంస్థలలో వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం లక్ష్యం గా పెట్టుకుంది. ఆర్టికల్ 243 టి (6) ప్రకారం.. ఇది మున్సిపాలిటీల్లో వెనుకబడిన తరగతుల పౌరుల కోసం సీట్లు, ఛైర్ పర్సన్ పదవుల్లో అదనపు రిజర్వేషన్లు క ల్పించడానికి రాష్ర్ట శాసనసభలను అనుమతిస్తుం ది.
ఇతర స్థానిక సంస్థలలోని రి జర్వేషన్ల మాదిరిగానే, వెనుకబడిన తరగతులకు అనుకూలంగా రిజర్వేషన్లు క ల్పించడాన్ని ఈ భాగం నిరోధించదని పే ర్కొంటుంది. తెలంగాణా పంచాయితీరాజ్ యాక్టు 2018లోని యాక్టు 201ను ఒకసారి పరిశీలిస్తే.. తెలంగాణ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ జరిపిన గణాంకాల ఆధారంగా బీసీ రిజర్వేషన్ల శాతాన్ని రాష్ర్టశాసన సభలు నిర్ణయించాలి. కానీ 201 యాక్టు ను రాష్ర్ట పంచాయితీ రాజ్ చట్టం 2018 లో మాత్రమే పొందుపరిచా రు.
అయితే కొన్ని రాష్ట్రాలు సర్వే ఎవరు చేయాలనే దానిపై నిర్థిష్టమైన క్లాజులను పొందపరుచలేదు. అందుకే ఆయా రాష్ట్రాలను సుప్రీం కోర్టు.. డెడికేటెడ్ కమీషన్లు నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల్లో, మున్సిపాలిటీల్లో బీసీల కు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది ఆయా సర్వేల ద్వారా రాష్ర్ట శాసనసభల్లో ప్రవేశపెట్టి, శాసనసభలు ఎంత శాతం నిర్ణయిస్తే ఆ శాతాన్ని అమలు చేసుకోవచ్చు. కానీ మహారాష్ర్ట, బీహర్‌లలో పంచాయితీరాజ్ యాక్టులో బీసీలు ఎంత శాతమనేది తేల్చాలనే నిర్దిష్టమైన క్లాజు లేనందున.. కేంద్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు అమలు చేస్తున్న 27 శాతాన్నే శాసనసభలో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి ఎన్నికల్లో దానినే అమలు చేశారు.
డెడికేటెడ్ కమిషన్లు
అయితే సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాల ఎన్నికలను, ఎన్నికయిన అభ్యర్థులను రద్దు చేసి, వెంటనే ఆయా రాష్ట్రాలు ఒక డెడికేటె డ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కో రింది. కమిషన్ ద్వారా సర్వే నిర్వహించి దాని ద్వారా ధృవీకరించబడిన బీసీల గణాంకాల శాతాన్ని అనుసరించి రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణలోనూ రాష్ట్ర హైకోర్టు డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది.
దాని ద్వారా ధృవీకరించిన శాతాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టి, చర్చించి బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో డె డికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. సర్వే, నివేదిక ద్వారా విధితమైన బీసీల గణాంకాల శాతాన్ని శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దానిపై చర్చించి ఆమోద ముద్ర వేసింది.
ఈ దశలో కొందరు బీసీ మేధావులు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకెలితే సమస్య వస్తుం దని భావించారు. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితి దాటిందని కోర్టులు కొట్టివేసే అవకాశముందని, అందువల్ల దీనిని ఏ కోర్టులు కొట్టేయకుండా ఉండాలంటే రిజర్వేషన్ల శాతాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని సూచించారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ బిల్లులను గవ ర్నర్ వద్దకు పంపించి బిల్లులను రాష్ట్రపతి వద్దకు పంపి ఆమోదింపజేసి 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు అనుమతి ఇచ్చేలా కోరాలని తెలిపారు.
కానీ బీసీ రిజర్వేషన్లపై బీజేపీ పాలిత కేంద్రప్రభుత్వం వ్యతిరేకంగా ఉండడంతో మూడు నెలలు కావొస్తున్నా బీసీ బిల్లులకు ఇప్పటివరకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడలేదు. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా మరో కేంద్ర మంత్రి ‘కేంద్ర ప్రభు త్వం కులగణన చేయదు. 2011లో కాంగ్రె స్ ప్రభుత్వం చేసిన కులగణన గణాంకాలు ప్రకటించము’ అని చెప్పడంతో బీసీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం కష్టమే అని అర్థమయ్యింది. ఈ విషయాన్ని గమనించిన ము ఖ్యమంత్రి రేవంత్ బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ర్ట శాసనసభలో ఆమోదింపజేసి అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపితే, ఇంతవరకు దానికి మోక్షము లభించలేదు.
గత సుప్రీం తీర్పులు
కొన్ని రోజులు వేచి చూసిన రేవంత్ ప్రభుత్వం సెప్టెంబర్ 26న స్థానిక సంస్థ ల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పి స్తూ జీవో నెంబర్ 9ని జారీ చేశారు. ఆపై రాష్ర్ట ఎన్నికల కమిషన్ కూడా స్పందిస్తూ.. రాష్ర్ట వ్యాప్తంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ను చాలెంజ్ చేస్తూ మాదవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ ను హౌస్ మోషన్‌గా స్వీకరించిన హైకోర్టు అక్టోబరు 8న తదుపరి విచారణ జరపనున్నట్లు పేర్కొంది. అయితే అక్టోబర్ 8న హైకోర్టు చేపట్టనున్న విచారణలో గతంలో సుప్రీంకోర్టు, డబ్ల్యు.పి.నెం. 259/1994, 356/1994 పిటిషన్లలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది. రిట్ పిటిషన్ 356/1994 (కె. క్రిష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆప్ ఇండియా ) కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్ర కారం అప్పటి బీజేపీ కర్నాటక ప్రభుత్వం..
అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కులగణన చేపట్టి బీసీ గణాంకాల శాతం నిర్థారించింది. అయితే తదుపరి బీజేపీ ప్రభుత్వం బీసీ గణాంకాలు లేవని అఫిడవిట్ దాఖలు చేయటంతో సుప్రీంకోర్టు క ర్ణాటకలో స్థానిక రిజర్వేషన్లను 50 శాతానికి కుదించమని తీర్పు ఇచ్చింది.
విద్య, ఉ ద్యోగ రంగాల్లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న బీసీ రిజర్వేషన్ల శా తంపై సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ 2 59/1994 (ఎస్‌వీ జోషీ, ఇతరులు వర్సె స్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, ఇతరులు)పై ఇచ్చిన తీర్పు ప్రకారం.. బీసీల అ ధికారిక గణాంకాలు తమ వద్ద ఉన్నాయం టూ త మిళనాడు ప్రభుత్వం 69 శా తం రిజర్వేషన్లను యధాతథంగా అమలు చే సింది. అ యితే కర్ణాటకలో బీజేపీ ప్రభు త్వం మా త్రం బీసీల అధికారిక గణాంకా లు తమ వద్ద లేవని చెప్పడంతో అక్కడ అ మల్లో ఉ న్న 84 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి కుదించాల్సి వచ్చింది.
న్యాయపోరాటం
తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి కుదించిన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్‌ను విమర్షించే హక్కు ఆ పార్టీకి ఎంతమాత్రం లేదు. పైగా గతంలో బీసీల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది.
డెడికేటెడ్ కమిషన్ స్వచ్ఛంద సర్వే తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే దీనిని సవాల్ చేస్తూ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు కావడంపై అనవసర ఆందోళన వద్దు. మా ధవరెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపి హైకోర్టు జీవోను రద్దు చేస్తే సు ప్రీం కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చే స్తాం. సమస్యను జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సిన అవసరముంది.
వ్యాసకర్త సెల్: 9440066717