18 April, 2026 | 11:47 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

మద్యానికి బానిసయ్యాడని భర్తను హతమార్చిన భార్య

21-04-2025 07:22 PM

పాపన్నపేట: మద్యానికి బానిసగా మారి ఇబ్బంది పెడుతున్నాడని భావించిన భార్య కూతురు తో కలిసి భర్తను హతమార్చిన సంఘటన పాపన్నపేట మండలం లో వెలుగుచుసింది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన కథనం ప్రకారం మండల పరిధిలోని నామాపూర్ గ్రామానికి చెందిన గొల్ల జోగయ్య (51) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసగా మారాడు. ప్రతి రోజూ మద్యం తాగి ఇంటికి రావడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. విసుగు చెందిన భార్య నాగమ్మ ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చిన్న కూతురుతో కలిసి జోగయ్య మెడకు చీరతో ఉరి బిగించి హత్య చేసింది. సాయంత్రం సమయంలో పొరుగున ఉన్నవారు జోగయ్య ఇంటికి వెళ్ళారు. ఇంట్లో చలనం లేకుండా జోగయ్య పడి ఉండటాన్ని గమనించి చికిత్స కోసం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అక్కడే మార్చరీలో శవాన్ని భద్రపరిచారు. సోమవారం బంధువులకు విషయం తెలువడంతో వారు అక్కడికి చేరుకొని పరీక్షించగా జోగయ్య మెడకు కమిలిన గాయం కనిపించింది. అనుమానం వచ్చి భార్య నాగమ్మను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి సోదరి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.