16-09-2025 01:04:42 PM
జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోచమ్మ గడ్డ తండాలో(Pochamma Gadda Thanda) అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రత్యేక చొరవతో పోచమ్మ గడ్డ తండాలో మూడో ఫండ్ ద్వారా సీసీ రోడ్డు మంజూరైంది. మంగళవారం నాడు రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా ప్రారంభించారు. గత పదేళ్లలో లేని అభివృద్ధి పనులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నాయని తండా వాసులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు, యువకులు, గ్రామంలోని పెద్దలు పాల్గొని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అభివృద్ధి పట్ల కృతజ్ఞతలు తెలిపారు.