16-09-2025 01:01:28 PM
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే(Former MLA Hanmanth Shinde) సందర్శించారు. అనంతరం డయాలసిస్ పేషెంట్స్ తో మాట్లాడి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా సేవలు అందుతున్నాయా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య బృందనికి పలు సూచనలు చేశారు.
ఏ చిన్న సమస్య ఉన్న ఆసుపత్రి విషయంలో కాని రోగుల విషయంలో వసతుల విషయంలో వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం అందించలన్నారు. ఏదైనా నివారణ కాలేదు అంటే తన దృష్టికి తీసుకోరావాలని మాజీ ఎమ్మెల్యే షిండే వైద్య అధికారులకు సూచించారు. వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులుకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ... ఆసుపత్రిలో ఒక వైద్యుడు ఉన్నాడని వెంటనే స్పెషలిస్ట్ వైద్యులను, రెగ్యులర్ వైద్యులను నియమించాలని మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వన్నికి డిమాండ్ చేశారు. ఆయన వెంట బిచ్కుంద సొసైటీ చైర్మన్ నల్చర్ బాలు మండల బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.