16-09-2025 12:55:57 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపల్(Bellampalle Municipality) పరిధిలోని రవీంద్రనగర్ లో మంగళవారం మధ్యాహ్నం ఎద్దు దాడి చేయడంతో జంగపల్లి రాజారాం(58) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో రాజారాం కడుపులో ఎద్దు కొమ్ములు దిగి తీవ్రంగా రక్తస్రావమైంది. గాయపడ్డ రాజారాంను స్థానికులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.