01-08-2025 01:43:40 AM
మద్యం కుంభకోణంలో చట్టం తనపని తాను చేసుకుపోతుంది: లోకేశ్
హైదరాబాద్, జూలై 31: ఓ మద్యం కంపెనీకి రూ.400 కోట్ల బంగారం కొనాల్సిన అవసరం ఏ ముందని ఏపీ మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. గురువారం నిర్వహించిన మీడియా సమావే శంలో లోకేశ్ మా ట్లాడుతూ మద్యం స్కాం సహా పలు అం శాలపై స్పందించారు.
ఓ మ ద్యం రూ.400 కోట్ల బంగారం కొన్నది? అదేమైనా ముడి సరుకా? అంత పెద్దమొత్తంలో బంగారం ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. మద్యం కేసులో జగన్ అరెస్ట్ అవుతారా అని ప్రశ్నించగా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
‘ఆదాన్ డిస్టిలరీస్ నుంచి మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ కంపెనీకి డబ్బులు వెళ్లలేదా? ఈ విషయంలో ఆయన సమాధానం చెప్పగలరా? హైదరాబాద్ శివారులోని ఫాంహౌస్‌లో దొ రికిన డబ్బులు నావి కాదని రాజ్ కె సిరెడ్డి చెప్పాడంటే. జగన్‌వేనని అర్థం చేసుకోవాలి. పట్టుబడిన నగదు డంప్‌లో ఏ పెట్టెలో ఎంతుందో ఆ యనకే తెలుసు’ అని పేర్కొన్నారు.