01-08-2025 01:42:24 AM
కాప్రా, జులై 31 : ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బుద్ధభవన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను మర్యాదపూర్వకంగా కలిసి, కాప్రా, నాచారం డివిజన్ల పరిధిలోని హెచ్‌ఎంటీ నగర్ చెరువు, పటేల్ కుంట, రామంతపూర్ పెద్ద చెరువు, చిన్న చెరువుల పూడిక తీత, సుందరీకరణ పనులపై వినతిపత్రం అందజేశారు ఎమ్మెల్యే.
వీటికి కమిషనర్ రంగనాథ్ సానుకూలంగా స్పంది స్తూ త్వరలో చెరువుల పరిశీలనకు వచ్చి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ గ్రేటర్ నాయకులు సాయి జెన్ శేఖర్, గంధం నాగేశ్వర్ రావు, బైరీ నవీన్ గౌడ్, నేమూరి మహేష్ గౌడ్, కాలేరు నవీన్, ఇంద్రయ్యా, జెట్ట కిషోర్, భాషపల్లి నిరంజన్ చారి, రాంరెడ్డి, ఉపేందర్, కట్ట బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.