17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పాలమూరులో గెలవని రేవంత్ బీజేపీని నిలువరిస్తడా?

10-04-2025 02:40 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): సొంత జిల్లాలో తన పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో, దేశవ్యాప్తంగా బీజేపీని నిలువరిస్తామని మాట్లాడటం హాస్యాస్పదమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించా రు.

మహబూబ్‌నగర్ ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్‌పై తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించారని, ఆయన ప్రాతినిథ్యం వహించిన మల్కాజ్‌గిరిలోనూ బీజేపీ చేతిలోనే కాంగ్రెస్ చిత్తుగా ఓడిందని గుర్తుచేశా రు. రేవంత్ పోటీ చేసిన కామారెడ్డితో పాటు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌పై బీజేపీదే విజయమని పేర్కొ న్నారు.

హైదరాబా ద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీలో నిలబెట్టేందుకు సరైన అభ్యర్థి లేక ఎంఐ ఎం పార్టీకి మద్దతునిచ్చే స్థాయికి దిగజారిపోయిందన్నారు. అయినప్పటికీ అహ్మదాబా ద్‌కు వెళ్లి దేశంలో బీజేపీని నిలువరిస్తామని రేవంత్ మాట్లాడటం చూస్తే నవ్వొస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంతరించే స్థితికి చేరుకుందని, భవిష్యత్తు బీజేపీదేనని బండి సంజయ్ వెల్లడించారు.