23-10-2025 12:00:00 AM
							డాక్టర్ సంగని మల్లేశ్వర్ :
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రు లు ఉండరనే నానుడి దశాబ్దాలుగా విం టూనే ఉన్నాం. భారత రాజకీయాల్లో అనే క మార్లు ఇది రుజువైంది. రెండు పార్టీల మధ్య పొత్తు కానీ, పలు పార్టీలు కలిసి కూ టమి ఏర్పాటు చేయడం, రాజకీయ అవసరాల కోసం రాత్రికి రాత్రి నాయకులు కండువాలు మార్చడం పరిపాటైపోయిం ది. ఇక్కడ స్నేహం, మోజు లాంటివి ఉండ వు.
జాతీయ, రాష్ర్ట రాజకీయాల్లో ఫిరాయింపుల సునామీ వేగంగానే సంభవిస్తుం టాయి. ఈ మార్పుల గురించి ప్రజలు పట్టించుకోవడం మర్చిపోయారు. అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికల దృష్ట్యా దేశం చూపు మొత్తం అటు వైపే మళ్లింది. ఈ రాష్ర్టంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష కూటములకు కీలకంగా మారాయి. బీహార్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకోడానికి కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎం ఎం, ఇతర పార్టీలతో కలిసి ‘మహాఘట్ బంధన్’ కూటమిగా ఏర్పడింది.
ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా రాష్ర్టంలో అధికారాన్ని చేజెక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఈ కూటమి పావులు కదుపు తుంది. మరోవైపు అధికార ఎన్డీఏ కూట మి సీట్ల పంపకంలో చాణక్యత ప్రదర్శించింది. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూట మికి సీట్ల పంపకంలో తేడాలు వచ్చి ఊ హించని విధంగా బీహార్ ఎన్నికల్లో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది.
ఏకంగా మ హా కూటమి నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వైదొలిగిందనే ప్రచా రం జోరుగా జరుగుతుంది. ఇదే జరిగితే అధికార కూటమికి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇక జేఎంఎం పార్టీ బీహార్‌లో ఆరు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఒకవేళ కూటమి నుంచి బయటకు వచ్చినా, 2025 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహా కూటమితో జేఎంఎం తెగతెంపులు చేసుకున్నా ఒక ముఖ్యమైన పరిణామంగా మా రబోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సీట్ల పంచాయితీ
బీహార్‌లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. తాజాగా మహాకూట మిలో సీట్ల పంపకాల అంశం మరింత వేడిని పెంచింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రోజురోజుకు పరిణామాలు మారు తూ వస్తున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు వేసిన ఎన్డీయే ఎన్నికల ప్రచారంలో దూ సుకుపోతుంది. కానీ మహాఘట్ బంధన్‌లో మాత్రం సీట్ల పంచాయతీ నేటికి తెగ లేదు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం సీట్ల విషయంలో విభేదాలు తలెత్తడంతో కూటమిలో అసహజ పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్‌కు కేటాయించిన కొన్ని స్థానాల్లో ఆర్జేడీ నాయకులు తమ అభ్యర్థులను నిలబెట్టడం తీవ్ర అసహనానికి దారితీసింది. ముఖ్యంగా బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్ కుటుంబ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి నా మినేషన్ దాఖలు చేయడం ఉద్రిక్తతను పెంచింది. ఇదే సమయంలో, జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కూటమిలో తగిన సీట్లు దక్కకపోవడంతో బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా బరి లోకి దిగుతామని ఆ పార్టీ ప్రకటించింది.
ఆరు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను దింపనున్నట్లు జేఎంఎం నేతలు వెల్లడించారు. కానీ తెల్లారే సరికి జేఎంఎం పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. ఎన్నికల సమయంలో పాత పొత్తుల భగ్నం, కొత్త పొత్తులు ఏర్పడడం షరామామూలే. ‘మహాఘట్ బంధన్’ కూటమిలో సీట్ల పంచాయతీ చర్చలు ఇం కా స్పష్టతకు రాకపోవడంతో, ఆర్జేడీెేకాంగ్రెస్ మధ్య అవిశ్వాస వాతావరణం ఏర్ప డుతుంది. ఈ విభేదాలు పరిష్కారం కాకపోతే, రాబోయే ఎన్నికల్లో మహా కూటమి ప్రభావం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆ పార్టీలదే ఆధిపత్యం
బీహార్ రాజకీయ రంగంలో వంశపారంపర్య పార్టీల ఆధిపత్యం కొనసాగు తోంది. ఎన్నికల సమయంలో వారసత్వ రాజకీయాలను ప్రచారాస్త్రంగా మార్చుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడడం చూ స్తుంటాం. కానీ బీహార్‌లో మాత్రం అలాం టి దాడికి తావులేదు. అన్ని రాజకీయ పా ర్టీలు ఇలాంటి వారసత్వ రాజకీయాలు పు ణికి పుచ్చుకున్నవే. అధికార బీజేపీ, జేడీ యూ మొదలుకొని ఆర్జేడీ సహా అన్ని పార్టీలది అదే తీరు.
అభ్యర్థుల్లో గణనీయమైన సంఖ్యలో స్థిరపడిన రాజకీయ నా యకుల కుమారులు, కుమార్తెలు, భార్య లు, దగ్గరి బంధువులు ఎక్కువగా ఉన్నా రు. రాఘోపూర్ నుంచి ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ (లాలూ వారసుడు), తా రాపూర్ నుంచి బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి (మాజీ మంత్రి శకుని చౌదరి కుమారుడు), రఘునాథ్‌పూర్ నుంచి ఆర్జేడీకి చెందిన ఒసామా షాహాబ్ (దివంగత మహ్మద్ షాబుద్దీన్ కుమారుడు) ఉన్నా రు.
ఈ అసెంబ్లీ ఎన్నికల సమరానికి ‘సై’ అంటున్నారు. పార్టీల్లో వారసుల తీరును చూస్తుంటే సైద్ధాంతిక నిబద్దత రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను వా రు పెద్దగా పట్టించుకోవడం లేదనే విష యం స్పష్టంగా తెలుస్తోంది. ఎన్డీఏ కూట మి చాప కింద నీరులా ప్రచారంలో దూ సుకుపోతున్నది.
నితీశ్ ఆశలు అన్నీ కూడా జేఎంఎం కలయిక బెడిసికొట్టి కలిసి వస్తుందనే ఆశాభావంతో ఎదురు చూస్తున్నది. అయితే బీహార్ ఎన్నికల్లో మహా కూ టమి నుంచి జేఎంఎం పార్టీ బయటికి వచ్చినట్లు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాష్ర్టంలో విద్యకు సరైన ప్రాధాన్యం కల్పించక పోవ డం వల్లనే సామాజిక స్పృహ లేక ఈ పరిస్థితి తలెత్తిందని అభిప్రాయపడ్డారు.
నితీశ్ వైఫల్యం కలిసొచ్చేనా?
లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి నేతృత్వంలోని ఆర్జేడీ దుష్పరిపాలన తర్వా త రాష్ర్టం ఎదుర్కొన్న గందరగోళం నుంచి బీహార్‌ను బయటకు తీసుకురావడంలో ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ విఫలమయ్యారు. బీహార్ ఆర్థిక వ్యవస్థ స్తబ్దంగా ఉందని, క్షీణించిందని ఆర్థికవేత్తలు వాదిస్తున్నారు. బీహార్ ఎన్‌ఎస్‌డీపీ ఇప్పటికీ జాతీయ సగటులో మూడింట ఒక వంతు పడిపోయింది.
నితీశ్ కుమార్ ప్రభుత్వం 12 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రకటించినప్పటికీ 2023లో పట్టణ ప్రాం తాల్లో రాష్ర్ట నిరుద్యోగిత రేటు 10.2 శాతం గా ఉంటే.. గ్రామీణ నిరుద్యోగం దాదాపు 7.8 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ ను మెరుగుపరచడంలో, ఉద్యోగాలను సృష్టించడంలో, పెట్టుబడులను తీసుకురావడంలో బీహార్‌లో కుంటుపడుతున్న పేద రికాన్ని అంతం చేయడంలో ఆయన పూర్తి గా విఫలమయ్యారు.
పాలనలో బీహారీలు రాష్ర్టంలో జీవనాధార రాబడిని ఇచ్చే వ్య వసాయానికి తిరిగి వెళ్లారు. లక్షలాది మం ది కార్మికులు వివిధ రాష్ట్రాల్లో వలసలు వెళ్లి పొట్ట గడుపుకుంటున్నారు. పారిశ్రామిక అభివృద్ధి నితీష్ కుమార్ అతిపెద్ద వైఫల్యాల్లో ఒకటి. అనేక పెట్టుబడి శిఖరా గ్ర సమావేశాలు, విధాన సవరణలు ఉన్నప్పటికీ, బీహార్ పారిశ్రామికంగా వెనుకబ డిన రాష్ర్టంగా మిగిలిపోయింది.
‘బీహార్‌లో గ్రామీణ జనాభా విద్యా స్థాయి చా లా తక్కువ, జనాభాలో 14.71 శాతం మం ది మాత్రమే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. అందుకే రాజకీయంగా అవగా హన లేమి బీహార్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార యాత్ర’ లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఎన్నికల కమిషన్ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని ఆధారాలతో బయటపెట్టారు. మరోవైపు ఆర్జేడీ 143 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూ సుకుపోతుంది.
కాంగ్రెస్ 55 సీట్లతో సర్దుకొని మిగతా సీట్లు మిత్రులకు కేటాయిం చడం జరిగింది. కానీ కొన్ని సీట్లలో స్నేహపూర్వక పోటీ మళ్లీ అధికార పార్టీకి ఎక్కడ కలిసి వస్తుందోనని కాంగ్రెస్ జాగ్రత్త వహిస్తుంది. కాగా ప్రస్తుత సీఎం నితీశ్ కుమా ర్‌కు ఈ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఫ్రీ పోల్ సర్వేలు పేర్కొంటు న్నాయి.
బీహార్ ఫలితాలు కాంగ్రెస్‌కు జీవస్మరణ సమస్యగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూ టముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ ‘జన్ సురాజ్’ పార్టీ ఈ రెండు కూ టములకు పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. జేడీయూ ఓటు బ్యాంకు చీల్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ నేప థ్యంలో బీహార్ ఎన్నికల ఫలితాలు ఏ మ లుపు తిరుగుతాయనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.