calender_icon.png 4 November, 2025 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం కోటా కోసం కొట్లాడుడే!

23-10-2025 12:00:00 AM

జుర్రు నారాయణ యాదవ్ :

ప్రజాస్వామ్యం అంటేనే సమస్త ప్రజల ప్రాతినిధ్యంతో కూడిన ప్రజా ప్రభుత్వం. ‘ప్రాతినిధ్యం లేనిదే పన్నులు చెల్లించం’.. ఇది ప్రఖ్యాత అమెరికా విప్లవ నినాదం. 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ బీసీల్లో కొన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యమే లేదు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కోసం బీసీ కులాలు ఉద్యమాలు చేయాల్సి రావడం శోచనీయం.

భారత రాజ్యాంగంలో 15 (4),16 (4) 46, 243 డి, టి, 338 బి, 340 లాం టి ఆర్టికల్స్ బీసీల గురించి ప్రస్తావిస్తున్నప్పటికీ సరైన ప్రాతినిధ్యం కోసం బీసీలు ఇప్పటికీ ప్రజా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. రాజ్యాంగంలో ఎటువంటి ఆర్టికల్స్ ప్రస్తావన లేనప్పటికీ, ఏ ఉద్యమం చేయనప్పటికీ ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లపై ఒక వారం రోజుల్లోనే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంట్ ఆమోదించడం, రాష్ర్టపతి సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి.

ఇదెక్కడి న్యాయమని సుప్రీంకోర్టుకు వెళితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సరైన విధానమేనంటూ తీర్పునివ్వడం జరిగిపోయింది. మరి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును సంతకం కోసం గవర్నర్‌కు పంపడం, ఆయన రాష్ర్టపతికి పంపడం.. ఆపై ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలపకపోవడం.. ఈలోగా 50 శాతం వర్తిస్తుందని హైకోర్టు స్టే విధించ డం.. దానిని అది సుప్రీం కోర్టు సమర్థించడం వెనువెంటనే జరిగాయి. దేశంలో మె జార్టీలుగా ఉన్న బీసీలకు మాత్రం స్వతం త్ర భారతదేశంలో సమ న్యాయమనేది అందని దాక్షగానే మిగిలిపోతుంది.

కారణాలు అనేకం

బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థ ల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం రాష్ర్ట ప్ర భుత్వం కుల గణన చేపట్టి, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి, ఎంపరికల్ డాటా ఆ ధారంగా శాసనసభ ఏకగ్రీవ ఆమోదంతో బిల్లులు గవర్నర్ దగ్గరికి పంపితే, వారు రాష్ర్టపతి దగ్గరికి పంపారు. రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ జారీ చేస్తే అది రాష్ర్టపతి దగ్గర ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

పంచాయతీ రాజ్ చట్ట సవరణతో జీవో నంబర్  9 జారీ చేసి 42 శాతం రిజర్వేషను రాష్ర్ట ప్రభుత్వం కల్పించే ప్రయత్నాలు చేసింది. అయితే గతంలో ప్రస్తుత ప్రయత్నాలంతా స్పష్టంగా కాకపోయినా 1971లో అనంతరామన్ కమిషన్ ద్వారా తెచ్చిన బీసీ రిజర్వేషన్లను హైకోర్టు కొట్టి వేసిం ది.1986లో మురళీధరన్ కమిషన్ సిఫారసుతో బీసీలకు తెచ్చిన 44 శాతం రిజర్వే షన్లు కోర్టు కొట్టివేసింది. 

ఈ విధంగా రాష్ర్ట ప్రభుత్వానికి గత అనుభవాలు ఉన్నా కూడా ప్రస్తుత ప్రయత్నంలో  హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చిం దంటే, సుప్రీం కోర్టు స్టేను సమర్ధించిందంటే రాష్ర్ట ప్రభుత్వ ప్రయత్నంలో ఎక్క డో లోపం ఉండే ఉంటుంది. సుప్రీం కోర్టు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇం డియా కేసులో స్థా నిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని పేర్కొంది. ఈ తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి, ఎంపరికల్ డేటా ను సేకరించి 50 శాతానికి మించకుండా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వవచ్చు.

ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వవచ్చు. రాష్ర్ట ప్రభుత్వం డెడికే టెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది, కానీ ఎం పిరికల్ డాటాను ప్రజలకు తెలిసేలా పెడితే బాగుండేది. ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం క్యాప్‌ను క్రాస్ చేయవచ్చు అనే వేసులుబాటు ఉంది. కాబట్టి 42% రిజర్వేషన్లకు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని బలంగా వినిపించి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రాష్ర్టం మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకోకుండా జిల్లాను లేదా రెవెన్యూ డివిజన్‌ను లేదా మండలాలను ఒక యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు నిర్ణయించాల్సింది. అలా కాకుండా రాష్ర్టం మొత్తాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల హైకో ర్టు మధ్యంతర స్టే ఇవ్వడానికి ప్రధాన కారణమయ్యింది.

అదొక్కటే మార్గం

ప్రస్తుతం బీసీలకు 42 శాతం రిజర్వేష న్లు త్రిశంకు స్వర్గంలో ఉండిపోయాయి. హైకోర్టు తుది తీర్పులో ఈ రిజర్వేషన్లను సమర్థిస్తుందా లేదా కొట్టివేస్తుందా? అనే ది చూడాలి. ఒకవేళ కొట్టివేస్తే రాష్ర్ట ప్రభు త్వం పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తుందా లేదా పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తుందా? పార్టీ పరంగా రిజర్వేషన్లను అన్ని పార్టీలు అనుసరిస్తాయా లేదా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాయా? ఇలాంటి ప్రశ్నలతో యావత్ బీసీ సమాజమే త్రిశంకు స్వర్గంలో తెలియాడుతుంది.

ప్రయత్నంలో కొన్ని లోపాలున్నప్పటికీ రాష్ర్ట ప్రభుత్వం చేయాల్సినా ప్రయత్నం చేసిందని చెప్పకుండా ఉండలేం. బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల్లోనే కాకుండా వి ద్యా, ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు సా ధించాలంటే రాజ్యాంగ సవరణ చేసి తొ మ్మిదో షెడ్యూల్లో చేర్చడమే పరిష్కారం. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం క్యాప్ దాటినప్పటికీ సుప్రీం కోర్టు కొట్టి వేయలేదంటే రాజ్యాంగ సవరణ వ ల్లే సాధ్యపడింది.

ఇప్పుడు 42 శాతం బీసీ రిజర్వేషన్లు కూడా రాజ్యాంగ సవరణ ద్వారా ఇస్తూ కోర్టు తీర్పుల నుంచి రక్షణ కోసం 9వ షెడ్యూల్లో చేర్చాలి. సమాజం లో మెజార్టీలుగా ఉన్న బీసీ కులాల ఆకాంక్షలకు పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా చట్ట రూపాన్ని ఇవ్వాల్సిన అవసరముంది.

మరో ఉద్యమం రావాల్సిందే

ప్రస్తుతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లనే ప్రజా ఆకాంక్ష ఇటు శాసన వ్యవస్థ.. అటు న్యాయవ్యవస్థ మధ్య నలిగిపోతోం ది. మెజార్టీ ప్రజల ఆకాంక్షలకు చట్ట రూ పం కావాలంటే, వాటిని న్యాయవ్యవస్థ సమర్థించాలంటే రాజ్యాంగంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు స్థానం కల్పించాలి. పార్లమెంటులో కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్య మం ఎలా తన ఆకాంక్షలను సాధించుకుం దో అలాంటి మరో ప్రజా ఉద్యమం కావాలి.

బీసీ సమాజంలో ఐక్య ఉద్యమాలతో పాటు జేఏసీలో ఐక్యత అవసరం. బీసీ స మాజానికి ఒక తాత్విక పునాది లేకుండా, బీసీ భావాజాలం విస్తృత పరచకుండా ఉ ద్యమాలు చేపడితే అవి నీటి బుడగలుగానే మిగిలిపోతాయి. తెలంగాణ ఉద్యమం లా గా బలమైన ప్రజా ఉద్యమాలు ఆకాంక్షల ను నెరవేరుస్తాయి.

ప్రజాస్వామ్యంలో ప్ర జా ఆకాంక్షల మేరకు పార్లమెంటు రా జ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. న్యా యవ్యవస్థ రాజ్యాంగ విలువలకు, పార్లమెంటు చట్టాలకు మధ్య ఎక్కడో ఒక దగ్గర సయోధ్య సాధిస్తుంది. ఈ విధంగా బీసీలు 42 శాతం రిజర్వేషన్లు సాధించాలంటే తె లంగాణ ఉద్యమ లాంటి మరో ప్రజా ఉద్యమం అవసరమే.

          వ్యాసకర్త సెల్: 9494019270