calender_icon.png 26 July, 2025 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ పరువు నిలిచేనా!

07-10-2024 12:46:40 AM

నేటి నుంచే ఇంగ్లిష్ జట్టుతో టెస్టు సిరీస్

బంగ్లా చేతిలో ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పాక్

ముల్తాన్: నేటి నుంచి పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. తాజాగా బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో వైట్ వాష్‌కు గురై ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌తో టెస్టుల్లో మంచి ప్రదర్శన కనబర్చాలని ఉవ్విళ్లూరుతోంది.

ఇంగ్లండ్ పాక్‌ల మధ్య మూడు టెస్టులు జరగనున్నాయి. మొదటి టెస్టుకు ఇంగ్లండ్ జట్టుకు ఒలీ పోప్ సారధ్యం వహించనుండగా.. పాక్‌కు షాన్ మసూద్ నేతృత్వం వహిస్తున్నాడు. చివరగా ఇంగ్లండ్ జట్టు 2022లో పాక్‌లో పర్యటించినపుడు 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

గత అనుభవాలను పాఠాలుగా నేర్చుకుని ఈ సారైనా ఇంగ్లండ్‌కు చెక్ పెట్టాలని మసూద్ బృందం భావిస్తుండగా... గతంలోలాగే ఈ సారి కూడా పాక్‌ను వైట్ వాష్ చేయాలని ఇంగ్లిష్ జట్టు భావిస్తోంది. మరి అక్టోబర్ 28వరకు సాగనున్న మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఏం జరగనుందో..