13-07-2025 12:00:00 AM
డాక్టర్ తిరునహరి శేషు :
కమ్యూనిస్టులను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే అత్యంత బలమైన పార్టీగా, నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా మూడు పర్యాయాలు అధికారంలోకి వచ్చి న పార్టీగా బీజేపీ రికార్డులకెక్కింది. మూడు పర్యాయాలుగా బీజేపీ కేంద్రంలో అధికార పీఠంపై కూర్చుంటున్నప్పటికీ, దక్షిణాదిపై మాత్రం కమల దళానికి పట్టుచిక్కడం లేదు. దక్షిణాదిపై పట్టుకోసమని బీజేపీ ద శాబ్దకాలంగా పోరాడుతూనే ఉంది. మిష న్ దక్షిణాది వ్యూహంతో అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.
అయినప్పటికీ గత రెండు లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీ దక్షిణాదిలో 29, 28 ఎంపీ సీట్లకే పరిమితమైంది. పొ త్తులు పెట్టుకోవడం, సొంతంగా ఎదగటం పై కమల దళం ఫోకస్ చేసింది. ఈసారి దక్షిణాది నుంచే జాతీయ అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎంపిక చేసి రాబోయే ఎన్నికల నాటికి దక్షిణాదిపై పట్టు బిగించాలనే వ్యూ హాలకి కాషాయశ్రేణులు పదును పెడుతున్నట్టుగా కనిపిస్తోంది.
పాండిచ్చెరితో సహా దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాల్లో బీజేపీ తన బలాన్ని పెంచుకునేందుకు ఒక్కో రాష్ట్రం లో, ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈసారి ఎలాగైనా సరే తమిళనాడులో పాగా వేయాలనే లక్ష్యంతో కమలనాథులు పావులు కదుపుతున్నారు. అందుకోసమే అన్ని రకాల వనరులను ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. హిందుత్వ అజెండాతో ఎలాగైనా సరే తమిళ పీఠంపై పాగా వేయాలని చూస్తున్నారు.
పొత్తులతో పీఠం చిక్కేనా?
ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ అధికారంలోకి రాగలిగింది. మిగతా రాష్ట్రాల్లో అధి కారం ఆ పార్టీకి అందని ద్రాక్షలానే ఊరి స్తూ ఉంది. ఎన్ని ఎత్తులు వేసినా కానీ కమ లం వికసించడం లేదు. దక్షిణాదిలో బలపడటానికి బీజేపీ ప్లాన్ బీ అమలు చేస్తు న్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగ ంగా బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తు పె ట్టుకుని సానుకూల ఫలితాలు సాధిస్తుంది.
2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి రాజకీయంగా ఎంతో అనుకూలించింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను పాలిస్తోంది. తెలుగుదేశం పార్టీ తో పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో మూడు లోక్‌సభా స్థానాల్లో విజయం సాధించడమే కాదు.. కూటమి మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో 21 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది.
కేం ద్రంలో మెజారిటీ తక్కువ పడినా కానీ టీడీపీ ఉండటం వల్ల బీజేపీకి ఎలాంటి ఢో కా లేకుండా పోయింది. అదేవిధంగా 2023లో కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని పునరావృతం కా కుండా 2024 లోక్‌సభ ఎన్నికలలో జనతాదళ్ (సెక్యులర్)తో పొత్తు పెట్టుకుని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గాను 19 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితం అయింది.
కన్నడనాట అధికారం చేజిక్కించుకుని ఊపుమీదున్న కాంగ్రెస్‌ను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయడంలో కాషాయ దళం విజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో, కర్ణాటకలో జనతా దళ్ (ఎస్)తో పొత్తు పెట్టుకోకపోయి ఉం టే, బీజేపీకి కేంద్రంలో అధికారం అంత ఈజీగా దక్కేది కాదు. ఈ రెండు రాష్ట్రాలలో పొత్తులతో బీజేపీ స్వయంగా బలప డటమే కాదు భాగస్వామ్య పక్షాల బలం తో అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం.
తమిళ గడ్డపై పాగా కోసం..
దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పాగా వేయటానికి బీజేపీ విశ్వప్ర యత్నాలు చేస్తుందనే చెప్పాలి. నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఈ దశాబ్దకాలంలో బీజేపీ తమిళనాడులో తన ఓటు బ్యాంకు పెంచుకోగలిగింది కానీ, ఎన్నికల్లో అనుకూల ఫలితాలు సాధించలేకపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడులోని ఎనిమిది చిన్న పార్టీలతో జట్టు కట్టి తన ఓటు బ్యాంకును అన్నామలై నేతృత్వంలో 3.6 శాతం నుంచి 11.2 శాతానికి పెంచుకోగలిగింది.
ఓటు బ్యాంకయితే పెరిగింది కానీ ఒక్క సీటు కూడా ఇక్కడ సాధిం చలేకపోయింది. పోటీ చేసిన 25 లోక్‌సభ స్థానాల్లో ఏ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. గెలుపు రుచి చూడలేదు కానీ పోటీ చేసిన తొమ్మిది స్థానాల్లో రెండో స్థానంలో నిలవగలిగింది. ఈ సానుకూల ఫలితాలతోనే 2026లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో అధికార డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కజగం) కూటమిని ఢీ కొట్టేందుకు సిద్ధమైంది.
స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేను ఓడించేందు కు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అం దుకోసం పాత మిత్రపక్షమైన అన్నాడీఎంకేతో పొత్తుకు సిద్ధపడింది. ద్రవిడ పార్టీల సహకారం లేకుండా తమిళనాడులో బ లం పెంచుకోలేమని అర్థం చేసుకున్న బీజే పీ అందుకు అనుగుణంగా అన్నాడీఎంకేకు దగ్గరైంది. బీజేపీలో ట్రబుల్ షూట ర్‌గా పేరొందిన కేంద్ర హోం మంత్రి అమి త్ షా రాజకీయ వ్యూహాలతో తమిళనాడులో దూసుకుపోవాలని తహతహలాడు తోంది.
మాజీ సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకేతో పొత్తుతో పాటు మరో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, దినకరన్, శశికళ సహకారం కూడా తీసుకోవాలని భావిస్తోంది. అందుకు అనుగు ణంగా పావులు కదుపుతోంది. తమిళనాడులో బీజేపీ రాజకీయ వ్యూహాలు ఫలిస్తే రాజకీయ ప్రత్యర్థులైన డీఎంకే, కాంగ్రెస్‌లకు ఏకకాలంలో చెక్ పెట్టినట్టు అవుతుంది.
తెలంగాణలోనూ ఆంధ్రా ప్రయోగమే!
ఆంధ్రప్రదేశ్‌లో 2024లో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపో యి నా 40 శాతం ఓట్లను సాధించగలిగింది అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీలు పొ త్తు లేకుండా పోటీ చేసి ఉంటే ఫలితాలు ఎలా ఉండేవో మనకు ఇట్టే అర్థమైపోతుం ది. బలమైన జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కూటమి కట్టి విజయం సాధించిన విధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని బీజేపీ సమర్థవంతంగా వాడుకుం టోందనడంలో ఎటువంటి సందేహం లేదు.
2024లో తెలంగాణలో జరిగిన లో క్‌సభ ఎన్నికల ఫలితాలు ఎప్పటికైనా తె లంగాణ పీఠంపై కూర్చోగలమనే నమ్మకా న్ని బీజేపీకి కలిగించాయి. లోక్‌సభ ఎన్నికల్లో 35 శాతం ఓటు బ్యాంకుని సాధించ డమే కాదు అధికార కాంగ్రెస్‌కు దీటుగా ఎ నిమిది లోక్‌సభ స్థానాలు సాధించింది. అంతే కాకుండా కీలకమైన ఉత్తర తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలలో గెలు పొంది మరింత ఉత్సాహంతో ఉరకలేస్తోం ది.
ఈ వరుస పరిణామాలు పార్టీ నేతలు, కార్యకర్తల్లో విశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. 2028లో జరిగే తెలంగాణ రాష్ర్ట శాసనస భ ఎన్నికలలో మొదటిసారి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల నడుమ త్రిముఖ పోరు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్న నే పథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో చేసిన ప్రయోగ మే తెలంగాణలో కూడా చేస్తారా? అనే వి శ్లేషణలు జరుగుతున్నాయి.
తెలంగాణలో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీ జేపీ, జనసేనలు కలిసి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. తెలంగాణలో బీజేపీ తాను అధికారంలోకి రావ టం కంటే కాం గ్రెస్‌ని ఓడించేందుకే ఎక్కు వ ప్రాధాన్యతనిస్తుంది. కాబట్టి అప్పటి రాజకీయ అవసరాల దృష్ట్యా తమిళనాడు, కర్ణాటక తరహాలో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుని పోటీ చేసే అవకాశాలను తోసిపుచ్చలేం. తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ తరహాలో నే బలమైన పార్టీతో బీజేపీ పొత్తుకు సిద్ధమైతే ఆ కూటమి కాంగ్రెస్‌కి బలమైన ప్ర త్యర్థిగా మారే అవకాశం ఉంటుంది.
బీ జేపీ ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పొత్తులతో ముందుకు వెళ్తున్న తరుణంలో తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకునేందుకు ఉన్న అవకాశాలను ఎలా వదులు కుంటుంది. దక్షిణాదిపై రాజకీయంగా పట్టు సాధించడం ద్వారా కాంగ్రెస్‌తో పాటు డీఎంకే పార్టీని కూడా దెబ్బతీయవచ్చనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. తమిళనాడులో డీఎంకేని బలహీన పరచడం ద్వారా దక్షిణాదిపై ఆధిపత్యాన్ని సాధించవచ్చని బీజేపీ భావిస్తోంది.
వ్యాసకర్త సెల్- 98854 65877