03-02-2026 07:38:56 PM
రాజాపూర్: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లక్ష్మారెడ్డి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నాయకులు లక్ష్మారెడ్డికి శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు లక్ష్మారెడ్డి వెంబడి ర్యాలీగా జడ్చర్ల కు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్,అభిమన్యు రెడ్డి,బచ్చిరెడ్డి,మహిపాల్ రెడ్డి,సత్తయ్య,ఆనంద్ గౌడ్, రమేష్ నాయక్, వెంకటేష్,యాదగిరి,నజీమ్ బెగ్ తదితరులు పాల్గొన్నారు.