03-02-2026 02:35:31 AM
11వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కాలాల్ రాజు గౌడ్
జిన్నారం/ అమీన్ పూర్, ఫిబ్రవరి 2: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని గడ్డపోతారం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో జిన్నారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాజు గౌడ్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో 11వ వార్డులో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలనకు నాంది పలికింది కాంగ్రెస్ పార్టీయేనని, కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు.
మాదారం అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పేదల సంక్షేమం వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీతారాం సింగ్, సీతారాం యాదవ్, రాజేందర్ సింగ్, లక్ష్మణ్ యాదవ్, దుర్గా సింగ్, కార్యకర్తలు, యువకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.