13-09-2025 03:37:50 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఏసీఎం- డబ్ల్యూ స్టూడెంట్ చాప్టర్, సిఎస్‌ఐ స్టూడెంట్ బ్రాంచ్ సంయుక్తంగా ఈ నెల 8 నుంచి 12 వరకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి), డ్రోన్ టెక్నాలజీపై నిర్వహించిన విద్యార్థుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం (బూట్ క్యాంప్) శుక్రవారం విజయవంతంగా ముగిసింది. ము గింపు వేడుకకు డా. కొర్ర లక్ష్మణ్ (అదనపు డైరెక్టర్ ఎన్‌ఐ ఈఎల్ ఐటి హైదరాబాద్) ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది మనం వాడే వస్తువులను ఇంటర్నెట్ తో అనుసంధానించడం అని చెప్పారు. టెక్నాలజీ వలన వ్యవ సాయ రంగం, ఆరోగ్య రంగం , స్మార్ట్ సిటీస్, స్మార్ట్ ఫోన్స్,మొదలగు వాటిల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. డ్రోన్ టెక్నాలజీలో ఉపయోగించే డ్రోన్లు వ్యవసాయ రంగంలో పంటలపై మందులు పిచికారి చేయడం, రక్షణ విభాగంలో సమాచారాన్ని సేకరించడం, విపత్తుల సమయాలలో సహాయక చర్యలను చేయ డం, సినిమాలను చిత్రీకరించడం మొదలగు వాటిల్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వివరించారు.
ఐఓటి మరియు డ్రోన్ టెక్నాలజీ రెండూ కలిసినప్పుడు మరింత శక్తివం తమైన ఫలితాలు వస్తాయని వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బిఎల్ రాజు మాట్లాడుతూ.. ఐఓటి మరియు డ్రోన్ టెక్నాలజీలు మన భవిష్యత్తును మార్చే శక్తివంతమైన సాధనాలని చెప్పారు. పరిశ్రమలు మరియు వ్యవసాయ రంగాలకు సంబంధించిన ప్రయోగాలలో ఈ సాంకేతిక పరిజ్ఞానము ఎన్నో అవకాశాలను సృష్టిస్తోందని గుర్తు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థు లందరూ ఈ సాంకేతికతను నేర్చుకొని సమాజ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం హెచ్‌ఓడి డా. ఆర్ మదనమోహన మాట్లాడుతూ.. ఈ శిక్షణా శిబిరంలో నిర్వహించిన సాంకేతిక తరగతులు మరియు వర్క్ షాప్‌ల కారణంగా ఐఓటి మరియు డ్రోన్ అప్లికేషన్లలో ఎంతో అనుభవాన్ని అం దించిందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు సెన్సార్, రియల్ టైం డేటా కలెక్షన్, ఆటోమేషన్, నావిగేషన్ మొదలైన వాటిల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందారని చెప్పారు.
డా. పోటు నారాయణ (సి ఎస్ ఐ స్టూడెంట్ బ్రాంచ్ కోఆర్డినేటర్ ) డా. పి ఆర్ అనిషా (ఏసీఎం ఫ్యాకల్టీ స్పాన్సర్) క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఈ ప్రత్యేక శిక్షణా శిబిరంలో కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్ కే కృష్ణారావు, మేనేజ్మెంట్ సభ్యులు టి రాకేష్‌రెడ్డి, ఆర్ ప్రదీప్‌రెడ్డి, డీన్ ప్రొఫెసర్ ఏ వినయ్‌బాబు, డైరెక్టర్ వి అనురాధ, వైస్ ప్రిన్సిపల్ డా. బి.వి.రమణమూర్తి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఏ రమేష్ పాల్గొన్నారు.