23 May, 2026 | 2:27 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

రుజువు చేస్తా.. రాజీనామా చేస్తారా?

30-11-2025 01:26 AM
  1. హిల్ట్ స్కామ్‌ను తేల్చకపోతే నేను రిజైన్ చేస్తా

సీఎం, మంత్రులకు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సవాల్

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): ‘హిల్ట్ పాలసీ ల్యాండ్ లూటీ స్కా మ్ అని రుజువు చేస్తే మీరు పదవులకు రాజీనామా చేస్తారా? కుంభకోణం అని నిరూ పించకుంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని, ఈ సవాల్‌కు మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి సిద్దమా? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికే కాదు, క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులకు సవాల్ చేస్తున్న.

మహేశ్వర్‌రెడ్డి శనివారం అసెంబ్లీ మీడియా పా యింట్ వద్ద కుర్చీ వేసుకుని కూర్చున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కు కూడా రెండు కుర్చీలను వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... హిల్ట్ పాలసీ రూ.ఆరు లక్షల కోట్ల మేర అవినీతికి ఆస్కారమున్న ల్యాండ్ లూటీ స్కామ్ అని రుజువు చేస్తానని అన్నరు. రుజువు చేయలేకపోతే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తాన ని, మరి రుజువు చేస్తే మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సవాల్ చేశారు. ల్యాండ్ లూటీ మాఫి యా డాన్‌లా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి కూడా సీఎం పదవికి రిజైన్ చేయాలన్నారు.