లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించండి
01-05-2024 01:25 AM
సామాజికవేత్త లుబ్నా సర్వత్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ (విజయక్రాంతి): హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్‌పీ) తరఫున పోటీలో నిలిచిన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రముఖ సామాజిక కార్యకర్త లుబ్నా సర్వత్ కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఎన్నో ఏళ్లుగా పేదల హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తున్నానని, చెరువుల పరిరక్షణ, నాళాల కబ్జాలపై పెద్ద ఎత్తున ఉద్యమించినట్లు వెల్లడించారు. మిరాలం చెరువు కాలుష్యంపై ఇప్పటికీ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఆదం షేక్, నర్రా సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




