30 రోజుల్లో రూ. 820 కోట్లు వసూళ్లు
గత సంవత్సరం రికార్డు బ్రేక్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎర్లీబర్డ్ స్కీమ్ లో భాగంగా నెల రోజుల్లో రూ. 820కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసింది. ఈ నెల రోజుల్లో 7లక్షల 27మంది ఆస్తిపన్ను చెల్లించారు. మంగళవారం ఒక్కరోజే రూ. 96. 61కోట్లు వసూలు అయింది. గతేడాది నెల రోజుల్లో రూ. 766 కోట్లు కాగా.. ఈ ఏడాది అంతకుమించి వసూలై గత సంవత్సరం రికార్డును బ్రేక్ చేసింది. బల్దియాకు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
2023 సంవత్సరానికి మొత్తం ఆస్తిపన్ను రూ. 1914.87కోట్లు వసూలు అయ్యాయి. ఈ మొత్తం 2022 24 ఏడాది ప్రారంభం ఏప్రిల్ నెలలో ఎర్లీబర్డ్ స్కీమ్‌లో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు 5 శాతం రాయితీ ఇవ్వడం వల్ల రూ. 786కోట్లను జీహెచ్‌ఎంసీ రాబట్టుకుంది. అదే విధంగా 2024 ఏడాదిలో ఎర్లీబర్డ్ స్కీమ్ ద్వారా రూ. 800 కోట్ల ఆస్తిపన్ను అనుకున్నట్లుగానే ఎర్లీబర్డ్ ద్వారా ఏప్రిల్ 30న మంగళవారం రాత్రి వరకు 9గంటల వరకు రూ. 820కోట్లు వసూలు అయినట్టు అధికారులు ప్రకటించారు. అయితే ఈ చెల్లింపులు అత్యధికంగా ఆన్‌లైన్ కావడంతో రాత్రి 12గంటల వరకు మరింత పెరిగే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. బుధవారం ఎర్లీబర్డ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు రానున్నాయి.




