17-01-2026 12:00:00 AM
తుంగతుర్తి, జనవరి 16: ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ప్రజాపాలన, సంక్షేమ పథకాల ఫలితంగా గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. మండల పరిధిలోని తూర్పు గూడెం గ్రామ పదవ వార్డు సభ్యులు కోడి సుశీల వెంకన్నతో పాటు బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తుల వెంకన్న, కొమ్మన బోయిన రామచంద్రు, గుండగాని అవిలయ్య గుండ్ల కండయ్య, గుండ గాని రమేష్ తో పాటు వివిధ పార్టీల కార్యకర్తలు గ్రామ సర్పంచ్ దాసరి ఎల్లమ్మ శ్రీను ఆధ్వర్యంలో రైతు కమిషన్ సభ్యులు సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ మేరకు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గ్రామస్థాయి అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం సహకారంతో తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు మందుల సామెల్ పెద్దపీట వేయటంతో పాటు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తున్నారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని తెలిపారు. ఈ. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రేతినేని శ్రీనివాస్, పోలపాక రామచంద్రు, గుండ గాని మహేందర్ గౌడ్, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.