calender_icon.png 17 January, 2026 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తన, విద్యుత్, వీబీజీ రామ్‌జీ బిల్లులను తక్షణమే రద్దు చేయాలి

17-01-2026 12:00:00 AM

ఆలేరు, జనవరి 16 ( విజయక్రాంతి ): విత్తన, విద్యుత్, వి బి జీ రామ్ జీ బిల్లు లను తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘాలు,ఎస్ కే ఎంల నాయకులు డిమాండ్ చేశారు, శుక్రవారం ఆలేరులోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ముందు కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చ(ఎస్ కే ఎం)లు ఇచ్చిన పిలుపు మేరకు 4 లేబర్ కోడ్ లను,విద్యుత్ సవరణ బిల్లు,విత్తన బిల్లు,ఉపాధి హామీ చట్టం పథకాన్ని రద్దు చేసే బిల్లులను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలోఅఖిల భారత రైతు.కూలీ సంఘం (ఏ ఐ కె ఎం ఎస్)జిల్లా అద్యక్షులు కల్లెపు అడివయ్య, జనార్ధన్ లు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాలను మోపడం అంటే ఇప్పటివరకు అమలు అవుతున్న పథకాన్ని రద్దు చేయడంలో భాగమేనన్నారు. ఈ కార్యక్రమంలో కేమిడి ఉప్పలయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్, సిపిఎం సీనియర్ జిల్లా నాయకుడు మొరిగాడి చంద్రశేఖర్, పద్మ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి: కోదాడ రూరల్ ఎస్త్స్ర గోపాల్

కోదాడ జనవరి 16: ప్రయాణ సమయంలో ముందస్తు జాగ్రత్తలు పాటించి ప్రమాదాల నుండి రక్షణ పొందాలని ఎస్త్స్ర గోపాల్ అన్నారు. అరైవ్ ఎలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం లో భాగంగా శుక్రవారం కాపుగల్లు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఉద్యోగులకు స్థానిక పౌరులకు రోడ్డు భద్రత నియమ నిబంధనలపై కోదాడ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రూరల్ ఎస్త్స్ర గోపాల్ మాట్లాడుతూ  ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సీట్ బెల్ట్ ధరించాలని కోరారు.

వీటి వినియోగం పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ప్రస్తుత సమాజంలో అధికంగా యువత రోడ్డు ప్రమాదాల బారినపడి అర్ధాంతరంగా మరణిస్తున్నారని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తల్లిదండ్రులకు శోకం మిగులుతుందని గుర్తు చేశారు. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ బాధ్యతగా ఉండాలని రోడ్డుపై ఒక క్రమ పద్ధతిలో వాహనాలను నడపాలని ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని కోరారు.