calender_icon.png 14 May, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరూ ఉండి అనాథల్ని చేశారు!

14-05-2025 12:58:31 AM

- 2 వేల పింఛన్ 4 వేలు చేయిస్తామని తల్లిదండ్రుల ఇల్లు అమ్మేసిన కొడుకులు, కూతురు 

- ప్రతినెలా వచ్చే పింఛన్ డబ్బులు కూడా లాక్కుంటున్న వైనం 

- రోడ్డుపై వదిలేయడంతో పరిస్థితి అత్యంత దయనీయం 

- ఆర్డీవో వెంకటరెడ్డికి ఫిర్యాదు చేసిన మహిళా నేత

 రాజేంద్రనగర్, మే 13: ముగ్గురు కొడుకులు, ఓ కుమార్తె.. అందరికీ పెళ్లిళ్లు చేశాడు. పెయింటింగ్ పనులు చేసి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు. వయ సు మీద పడింది. ప్రతినెలా 2 వేలు వస్తున్న పింఛన్ డబ్బులను 4 వేలు చేపిస్తామని వృ ద్ధ తల్లిదండ్రులను నమ్మబలికి వారి పేరు మీద ఉన్న 130 గజాల ఇల్లును ఇతరులకు అమ్మేశారు.

అనంతరం రోడ్డున పడేయడంతో వారి పరిస్థితి అత్యంత దయనీయం గా మారింది. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళా నేత మంగళవారం రాజేంద్రనగర్ ఆర్డిఓ వెం కటరెడ్డికి ఫిర్యాదు చేసింది. వివరాలు.. చా లా ఏళ్ల క్రితం నార్సింగి కి వలస వచ్చిన వడ్డెనాల కొమురయ్య, లక్ష్మమ్మ దంపతులు కూ రగాయల మార్కెట్ సమీపంలో ఉంటున్నా రు.

పెయింటింగ్ పనులు చేసిన కొమురయ్య ఎంతో కష్టపడి 130 గజాల స్థలం కొ ని కట్టుకున్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. ఓ కొడుకు చనిపో యాడు. వృద్ధ దంపతులకు వయసు మీద పడటంతో వారి బాగోగులను ఎవరు పట్టించుకోవడం లేదు. ఇటీవల ఓ కొడుకు రెం డువేల పింఛన్ డబ్బులను 4 వేలు చేయిస్తానని నమ్మబలికి కొమురయ్య దంపతుల పే రు మీద ఉన్న ఇంటిని 60 లక్షల రూపాయలకు ఓ నాయకుడికి అమ్మేశాడు.

అనంతరం తల్లిదండ్రుల బాగోగులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం తిండి కూడా పెట్ట డం లేదు. దీంతో కొమురయ్య లక్ష్మమ్మ దంపతులు రోడ్డున పడ్డారు. స్థానికులు కొం దరు మానవత్వం చూపించి వారికి భోజనం అందిస్తున్నారు. ఇల్లు కొనుగోలు చేసిన సదరు నేత ఇంకో ఆరు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది.

వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవలసిన పిల్లలు వారి పేరు మీద ఉన్న ఇంటిని అమ్మేసి వారికి కనీ సం కూడా తిండి పెట్టకపోవడం అత్యంత దారుణమని మాజీ కౌన్సిలర్ ఉషారాణి ఆ వేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాజేంద్రనగర్ లోని ఆర్డిఓ కార్యాలయానికి చేరు కొని ఆర్డీవో వెంకటరెడ్డికి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వృద్ధ దంపతులు అన్ని వి షయాలను ఆర్డిఓ వెంకటరెడ్డికి తెలియజేశా రు. కొమురయ్య పిల్లలకు వెంటనే నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటా మని ఈ సందర్భంగా ఆర్డీవో తెలియజేసినట్లు మాజీ కౌన్సిలర్ ఉషారాణి పేర్కొన్నా రు. వృద్ధ దంపతులను ఆదుకోవలసిన బా ధ్యత వారి పిల్లల పైనే ఉందని ఈ సందర్భం గా ఆమె తెలిపారు.

కొమరయ్యకు నెల వచ్చే పింఛన్ డబ్బులను కూడా పిల్లలు లాక్కుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన విషయంపై నార్సింగి పోలీసులకు కూ డా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అధికారులు వెంటనే స్పందించి వృద్ధ దంపతు లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వృద్ధ దంపతులకు కొంత ఆర్థిక సహాయం చేసినట్లు ఉషారాణి పేర్కొన్నారు.