24 August, 2026 | 10:08 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

21-06-2025 07:25 PM

తాడ్వాయి (విజయక్రాంతి): మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని డిఆర్డిఓ సురేందర్(DRDO Surender) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో శనివారం మహిళా గ్రూప్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది లేడీ ఎంటర్ప్రీనర్ లు గా మార్చాలనే లక్ష్యంతో ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ ప్రినర్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రపంచ బ్యాంకు నిధులతో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న రైసింగ్ అండ్ యాక్సలేరేటింగ్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ లతో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఉపయోగించుకొని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఎం రమేష్ బాబు, ప్రాజెక్ట్ అధికారి మహమ్మద్ ఖాసిం, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి లాలూ నాయక్, ఎంపీడీవో సాజీద్ అలీ, ఏపిఎం మనోహర్, మండల సమాఖ్య అధ్యక్షురాలు యశోద సీసీలు పాల్గొన్నారు.