calender_icon.png 15 July, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలి

15-07-2025 12:50:30 AM

  1. డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు

రాజకీయాలకతీతంగా పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

6,632 కోట్లు ఖర్చు చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

మధిర నియోజకవర్గంలోని 4590 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 5 కోట్ల 93 లక్షల వడ్డీ లేని రుణాల చెక్కులు

చింతకాని, జూలై 14 (విజయ క్రాంతి): మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమా ర్క మల్లు అన్నారు.రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థి క, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర సెర్ప్ సిఈఓ డి. దివ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయ క్ లతో కలిసి మధిర నియోజకవర్గం స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ భీమా, ప్రమాద భీమా చెక్కులు, చింతకాని మండలానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు లకు మంజూరు పత్రాలను సోమవారం పం పిణీ చేసారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమా ర్క మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చ డం కోసం ప్రభుత్వం రెండు కీలక నిర్ణయా లు తీసుకుందని, ఇండ్లు లేని నిరుపేదలు ఉండటానికి వీలు లేదని, ప్రభుత్వ సహకారంతో ప్రతి పేదవాడికి ఇండ్లు ఉండాలని ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం చేపట్టిందని అన్నారు.గత పాలకుల హయాంలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పాదయాత్రలో ఇండ్లులేక భయాందోళనలతో గడిపిన ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మొ దటి దశలో 4 లక్షల 50 వేల ఇండ్లు 22 వేల 500 కోట్లతో మంజూరు చేశామని, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక స హాయం అందిస్తున్నామని అన్నారు.

ప్రతి వా రం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు ని ధులు విడుదల చేస్తుందని ఎక్కడా కూడా ని ధుల సమస్య లేదని అన్నారు. గ్రామ పెద్దల ను పిలిచి వారి సమక్షంలో పండుగ వా తావరణంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పను లు ప్రారంభం కావాలని అన్నారు. రాజకీయాలకతీతంగా పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.93 లక్షల పేద కుటుంబాలకు రాష్ట్రంలో సన్న బి య్యాన్ని రేషన్ కార్డు ద్వారా సరఫరా చేస్తున్నామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిం డర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు.

సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు 40 శాతం డైట్ చా ర్జీలు, 200 శాతం కాస్మోటిక్స్ చార్జిలను పెం చామని, 104 చోట్ల యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను ఏర్పాటుకు మంజూరు చేసుకున్నామని, మహిళల కోసం 6 వేల 632 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర సెర్ప్ సిఈఓ డి. దివ్య మాట్లాడుతూ అందుకున్న విజయం అందరికి పంచుద్దాం అనే నినాదంతో మహి ళా సంఘాలలో నూతన సభ్యులను చేర్చాలని, 60 సంవత్సరాలు దాటిన వారు ప్రత్యే క సంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా,

డిఆర్డిఓ సన్యాసయ్య, డిపిఓ ఆశాలత, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డా. కళావతి బాయి, హౌసింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, చింతకాని మండల ఎంపీడీఓ సి.హెచ్. శ్రీనివాస్ రావు, సంబంధిత అధికారులు, మం డల సమాఖ్య సభ్యులు, ఏ.పి.ఎం.లు, మహిళలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.