15-07-2025 12:49:05 AM
సభ ఏర్పాట్లను పర్శిలించిన ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి, (విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణ కేంద్రంలో బుధవారం ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, తుమ్మల నాగేశ్వర్ రావు జిల్లా ప్రజా ప్రతినిధులు ఇతర నాయకులు ముఖ్య అతిధులుగా విచ్చేస్తున్న సందర్బంగా పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పరిశీలించారు. ఈ కార్యక్ర మంలో రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.