09-07-2025 12:00:00 AM
కలెక్టర్ ఆశిష్ సంగువాన్
కామారెడ్డి, జులై 8 (విజయక్రాంతి) ః ఇందిరామహిళా శక్తిలో భాగంగా కామారెడ్డి మం డల సమాఖ్య ప్రత్యేక సమావేశం మంగళవారం నిర్వహిం చారు. ఈ సమావేశానికి ము ఖ్యఅతిథిగా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ హాజరైనారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శక్తిలో భాగంగా ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళ సంఘం లో సభ్యత్వం తీసుకోవాలన్నారు.
ప్యాడి కొనుగోలు కేంద్రాలు ఈసారి బాగా చేశారు. ఇక ముందు కొనుగోలు కేంద్రాలు పెరుగుతాయి. బాగా పనిచేయాలని తెలిపారు. బ్యాంకు లింకేజీ టార్గెట్ ను 100% పూర్తి చేయాలని సూచించారు. డ్రోన్ ఏర్పాటు చేసుకొని వ్యవసాయ సంబంధ ఎరువులు, పురుగు మందులు పిచికారు చేసుకోవాలని తెలిపారు. జిల్లా సమాఖ్య భవన నిర్మాణం మండల సమాఖ్య ప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్, డిఆర్డిఓ సురేందర్, మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్, డిపిఎం ఫైనాన్స్ రాజయ్య, ఎంపీడీవో ఎఫ్సిబా, మండల సమాఖ్య ఏపీఎం మోహిజ్, సీసీలు విశ్వనాథం, అంజాగౌడ్, స్వరూప, సంజీవులు, వివోఏలు మండల సమాఖ్య పాలకవర్గం అధ్యక్షులు గోదావరి, కార్యదర్శి సరస్వతి, కోశాధికారి పూజా, గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.