calender_icon.png 15 September, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ మేధస్సుకు నిలువుటద్దం మోక్షగుండం

15-09-2025 07:30:59 PM

మణుగూరు,(విజయక్రాంతి): మానవ మేధస్సుకు నిలువుటద్దంగా మోక్ష గుండం విశ్వేశ్వరయ్య నిలిచారని, దేశంలోని ఎందరో ఇంజనీర్లకు ఆయన మార్గదర్శకుడని ఏరియా జనరల్ మేనేజర్  దుర్గం రామచందర్ పేర్కొన్నారు. సోమవారం జీయం కార్యాలయ సమావేశ మందిరంలో  జాతీయ ఇంజినీర్స్‌ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జియం మోక్షగుండం చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులు అర్పించి మాట్లాడారు.

ఆంధ్ర మూలాలు ఉన్న విశ్వేశ్వరయ్య కర్ణాటకలో పుట్టి, పెరిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ మీద మమ కారంతో హైదరాబాద్‌లో మూసినది మునక ప్రాంతాలకు రక్షణగా సివిల్‌ ఇంజినీరింగ్‌తో నిర్మాణాలు చేపట్టారన్నారు. తిరుమల మొదటి ఘాట్‌రోడ్డుకు డిజైన చేసిన విశ్వేశ్వరయ్య ఈ నాటికి, ఆ దారి చెక్కు చెదరకుండా ఉందంటే అది ఆయన ఉపయోగించిన పరిజ్ఞానమేనన్నారు. దేశం లో ప్రఖ్యాత  ఇంజినీర్‌గా పేరు ప్రఖ్యాతులు పొందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య సివిల్‌ ఇంజినీర్లకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన స్పూర్తితో మనమంతా రెట్టింపు ఉత్సాహంతో దేశ సేవకు, దేశ పురోభివృద్ధికి పున రంకితం కావాలని కోరారు.