calender_icon.png 15 September, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ అక్రమ రవాణాను అరికట్టాలి

15-09-2025 07:33:39 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): పింగిళి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా మూడవ రోజు సోమవారం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉనికిచర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత ఐపాఠశాల నుండి గ్రామంలోకి యాంటీ డ్రగ్ అవేర్నెస్ ర్యాలీని నిర్వహించి మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రత్యేక ఉపన్యాసంలో భాగంగా ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, వరంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జె.శ్యామ్ సుందర్ మాట్లాడుతూ... మానవ అక్రమ రవాణా ద్వారా పిల్లలను బాల కార్మికులుగా, భిక్షగాళ్లుగా తయారు చేస్తున్నారని, అమ్మాయిలను మాయమాటలతో లేదా బలవంతంగా వ్యభిచారం, లైంగిక బానిసత్వం వంటి వాటికి గురి చేస్తున్నారని, దీనిని ఎదుర్కోవడానికి అనేక చట్టాలు, పోలీసులు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయని ఆపదలో ఉన్నప్పుడు టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ప్రోగ్రాం అధికారి ఈ. కవిత, రామా రత్నమాల, డా. వి మమత, హెడ్మాస్టర్ శ్రీనివాస్ రావు, ఎస్ఐ యం. సుధాకర్, ఉమెన్ ఏఎస్ఐ యం. భాగ్యలక్ష్మి, పోలీస్ కానిస్టేబుల్ జి. రామారావు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.