15-09-2025 07:57:29 PM
చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండలం నూతన భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని సోమవారం ఎన్నుకున్నారు. మండల కమిటీ నూతన అధ్యక్షుడిగా సుక్క నరసింహ, కార్యదర్శిగా వడ్డేపల్లి శంకర్, ఉపాధ్యక్షులుగా దోర్నాల సంజీవ, చిరునబోయిన గట్టయ్య, సహాయ కార్యదర్శులుగా వలిగొండ పరమేష్, బాతరాజు గోపాల్, కోశాధికారిగా మాదరబోయిన వెంకన్నలతో పాటు మరో 8 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ కార్యక్రమానికి హాజరై నూతన కమిటీ కి అభినందనలు తెలిపి భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకుడు బండ నరసింహ, జె సత్యనారాయణ, ఉప్పలపల్లి లింగస్వామి, ఎరసాని రాములు, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.