12 March, 2026 | 8:19 AM

మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

12-03-2026 01:08 AM

మంత్రి వివేక్ వెంకటస్వామి 

జైపూర్ (చెన్నూర్), మార్చి 11 : మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం జైపూర్ మండలం ఇందారం గ్రామంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మండల తహసిల్దార్ వనజా రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధిఅధికారి సత్యనారాయణ, డిసిసి ప్రతినిధి రఘు నాథ్ రెడ్డిలతో కలిసి గ్రామైఖ్య సంఘాల భవనాలకు భూమి పూజ చేసిన అనంతరం మం త్రి మాట్లాడారు.

మహిళల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని రూ. 30 లక్షల వ్యయంతో మూడు గ్రామైఖ్య సంఘాల భవన నిర్మాణానికి భూ మి పూజ చేయడం జరిగిందన్నారు. జైపూర్ మండలంలో చేపట్టిన 1,250 మెగావాట్లపవర్ ప్లాంట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని, ప్లాంట్ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన పట్టాదారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగు తుందన్నారు. అనంతరం మండలంలోని 39 మంది కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో గ్రామైఖ్య సంఘాల మహిళలు, సం బంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

రైతుల సేవలో ముందుండాలి...

రైతులకు సేవలు అందించడంలో నూతన పాలక వర్గ సభ్యులు ముందుండాలని, వారు పండించిన పంటలకు ప్రభుత్వ మద్దతు ధర అందేలా చూడాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మం త్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీసి అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాజీ ఎంఎల్‌సీ పురాణం సతీష్ కుమార్ లతో హాజరై చైర్మన్‌గా మహేశ్ ప్రసాద్ తివారీ, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మ రాజమల్లా గౌడ్, చెన్నూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ తదితరులు పాల్గొన్నారు.