07-10-2024 01:27:00 AM
రాజేంద్రనగర్, అక్టోబర్ 6: దసరా, ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరిం చుకొని శంషాబాద్ పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ఆదివారం పద సంచలన్ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్ సేవకులు ఏకరూప దుస్తులతో టోపీలు ధరించి కవాతు నిర్వహించి ఆకట్టుకున్నారు.
యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలో ఆర్‌ఎస్‌ఎస్ సేవకులు పద సంచలన్ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో కవాతు చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
నారాయణఖేడ్: నారాయణఖేడ్‌లో పెద్ద ఎత్తున పద సంచలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక రామ్‌మందిర్ నుంచి మంగల్‌పేట్ భవాని మందిరం వరకు ర్యాలీ సాగింది. ఆర్‌ఎస్ లక్ష్యాలను, క్రమశిక్షణపై ప్రజలకు వివరించారు.