calender_icon.png 15 October, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు తప్పనిసరి

15-10-2025 06:37:16 PM

రేగొండ (విజయక్రాంతి): పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు విధిగా వేయించాలని జిల్లా పశుసంవర్ధక అధికారి డా. ఏ.కుమారస్వామి, ఏడి టి.గోపాలకృష్ణ మూర్తి అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ మండలంలో రేగొండ, రంగయ్యపల్లి గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించి, రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడారు. గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. ఈ నెల అక్టోబర్ 15 నుండి నవంబర్ 14 శుక్రవారం వరకు నెలరోజుల పాటు మండలంలోని అన్ని గ్రామాలలో పశువులకు, 4 నెలలు దాటిన దూడలకు, గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ కొరకై గాలికుంటు వ్యాక్సిన్” టీకాలు ఇస్తామని తెలిపారు.

పశువులకు టీకాలు వేయించుకోవాలని పాడి రైతులకు గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. ప్రభుత్వం పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి బారిన పడకుండా రక్షించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా  పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేగొండ పశువైద్యదికారి డా.మైథిలి, రంగయ్యపల్లి పశు వైద్యాధికారి డా.అభిషేక్, గోపాల మిత్ర, రైతులు తదితరులు పాల్గొన్నారు.