3 July, 2026 | 9:02 PM

Breaking News

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •  

అభివృద్ధికి సమన్వయంతో పని చేయాలి

05-06-2025 12:18 AM

- జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి 

- ప్రశాంతంగా 11వ సర్వసభ్య సమావేశం

- హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు 

ముషీరాబాద్, జూన్ 4: హైదరాబాద్ నగర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని జీహె చ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరా రు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కార్పొరేషన్ 11వ సాధారణ సమావేశం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది.

ఈ పహల్గాంలో మరణించిన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ అభివృద్ధికి తోడ్పా టును అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్జతలు తెలిపారు. నగర ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, కల్పించాల్సిన బాధ్యత మనందరి పైనా ఉన్నదన్నారు.

అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. వర్షాకాలంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అందులో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని కోరారు. నగరంలో ప్రజా సమస్యలనుపరిష్కరించుటకు జోనల్ వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు తమ కాలనీల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.

మల్కాజిగిర ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతంలో పేద వాళ్లు ఎక్కువగా ఉన్నారని, ఇందిరమ్మ ఇళ్లను స్థానిక ప్రదేశంలో ఇవ్వాలని, దూర ప్రదేశంలో ఇవ్వవద్దని కోరారు. కాగా ఈ సభకు మొట్టమొదటిసారిగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జపాన్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సమావేశం పూర్తయ్యే వరకు వారు సభ తీరును పరిశీలించారు. ఈ సమావేశంలో ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు విజయశాంతి, బల్మూరి వెంకట్, మిర్జా రియాజ్ ఉల్ హస్సన్‌ఎఫెంది, మిర్జా రహమత్ బేగ్, అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు జుల్ఫికర్ అలీ, మాజీద్ హుస్సేన్, కౌసర్ మోయినుద్దీన్, రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.