3 July, 2026 | 10:02 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం

05-06-2025 12:16 AM

జూన్ 4 (విజయక్రాంతి) : సీఎం సహాయ నిధి పేదలకు వరమని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి  అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో   సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నమన్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట మండలం 03, ఆత్మకూర్05, పెన్ పహాడ్04, చివ్వేంల06, సూర్యాపేట పట్టణం 20 మంది లబ్దిదారులకు మొత్తం 38 చెక్కులు 15 లక్షల 9500 రూపాయల విలువ చేసే చెక్కులను రాంరెడ్డి లకు అందజేశారు.

అధికారంలో వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు సూర్యాపేట నియోజకవర్గానికి మొత్తం 87 మంది లబ్ధిదారులకు 34 లక్షల 9500 విలువ చేసే చెక్కులు అందించామన్నారు..

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్, చింతమల్ల రమేష్, తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు వేములకొండ పద్మ,దివ్య,  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..