11-08-2024 12:05:00 AM
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలు దాదాపు అన్ని ప్రాంతాలలోనూ రోజురోజుకూ శ్రుతిమించుతున్నాయి. పని కట్టుకొని ఫలానా ప్రాంతం అనీ లేదు. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లి, వచ్చే వేళల్లో నరకమే కనిపిస్తున్నది. ఇందుకోసం అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఉదా॥కు జూపార్కు నుంచి ఆరాం ఘర్ వరకు నిర్మిస్తున్న ఫ్లు ఓవర్ పనులు చాలా నిదానంగా నడుస్తున్నాయి. దీనివల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది.
అరుణసాగర్, గద్వాల