calender_icon.png 12 September, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారికి జ్ఞానోదయం కలగదా?

11-08-2024 12:05:00 AM

రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగుల బండారాలు అడపా దడపా బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్‌లోని ఒక మున్సిపల్ రెవెన్యూ ఉద్యోగి ఇంట్లో అవినీతి సొమ్ము గుట్టలకు గుట్టలకు బయట పడటం ఆశ్చర్యకరం. ఏసీబీ సోదాలో రూ.2.93 కోట్ల నగదు, అక్రమాస్తులు 51 తులాల బంగారు ఆభరణాలు పట్టుబడ్డట్టు వార్తలు వచ్చాయి. లంచాలు లేకుండా పనులు కాని పరిస్థితులకు నెలవైన శాఖలు కొన్ని లేకపోలేదు. అందులో రెవెన్యూ శాఖ ఒకటి.

ఇంటి పర్మిషన్ నుంచి విద్యార్థులకు వివిధ సర్టిఫికెట్ల వరకు ప్రతీ పనికీ ప్రజలకు అక్రమ మార్గంలో డబ్బులు చెల్లించుకోవాల్సిన దుస్థితి ఉంది. చాలామంది అధికారులు, సిబ్బం ది అయితే బహిరంగంగానే లంచాలను తీసుకొంటుంటారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అవినీతి రహితంగా మారతారేమో అంటే అటువంటి పరిస్థితులు ఏవీ కనిపించడం లేదు. అసలు, ఇలాంటి వారు సమాజంలో ఎలా తలెత్తుకొని తిరుగ గలుతున్నారో అర్థం కావడం లేదు. కఠినమైన శిక్షలు వుంటే తప్ప ఈ సామాజిక జాఢ్యం నుండి మోక్షం లభించేలా లేదు.

 -కిశోర్‌కుమార్. ఎస్, నిజామాబాద్