calender_icon.png 3 February, 2026 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లీకేజీకి మరమ్మతులు

03-02-2026 03:05:13 PM

ఉపసర్పంచ్ దీపక్ ముండే 

వాంకిడి,(విజయక్రాంతి): స్థానిక మండల కేంద్రంలోని శివకేశవ ఆలయం సమీపంలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ కారణంగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆలయం సమీపంలోని కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న వాంకిడి ఉపసర్పంచ్ దీపక్ ముండే మంగళవారం లీకేజీ చోటుకు చేరుకుని పరిశీలించా రు. అనంతరం గ్రామపంచా యతీ కార్మికులతో కలిసి పైప్‌ లైన్‌కు తక్షణమే మరమ్మతు లు చేపట్టించి సమస్యను పరిష్కరించారు.

ఈ సంద ర్భంగా ఉపసర్పంచ్ దీపక్ ముండే మాట్లాడుతూ... ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడమే మా ప్రధాన లక్ష్యం. సమస్య చిన్నదైనా వెంటనే స్పందించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సమస్యలు వస్తే ఊరుకోం. ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాం అని స్పష్టం చేశారు.ఇదే విధంగా గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా తక్షణమే పరిష్కరి స్తామని ఆయన హామీ ఇచ్చా రు. ఉపసర్పంచ్ చొరవతో సమస్య పరిష్కారం కావడంతో ఆ కాలనీవాసులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట వార్డు మెంబర్ వికాస్ ఉన్నారు.