calender_icon.png 15 May, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభించిన పది రోజులకు పనులు బంద్..!

15-05-2025 01:44:42 AM

మక్తమాధారం నాగిరెడ్డిగూడ బిటి రోడ్డు ఏర్పాటుకు గ్రహణం 

కడ్తాల్, మే 14 :కడ్తాల్ మండలంలోని మక్తమాధారం - నాగిరెడ్డిగూడ తండాకు బీటీ రోడ్డు మంజూరైంది. రెండు నెలల క్రితం రోడ్డు పనులను స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నా రాయణరెడ్డి ప్రారంభించారు. కానీ గుత్తేదారు పనులు ప్రారంభించడంతో తండా ప్ర జలతో పాటు ఆయా గ్రామాల ప్రజలు సం బరపడ్డారు. ప్రారంభించిన పది రోజులకే గుత్తేదారు పనులు నిలిపివేశాడు. 

రోడ్డును అటూ ఇటూ తవ్వి రోడ్డు పక్కల మట్టిని పో శాడు. దీంతో మట్టి పోయడం వల్ల రెండు వాహనాలు సైడు కొట్టలేని పరిస్థితి. వర్షాలు కురుస్తుండడంతో రోడ్డు కోతలకు గురై ఆర్టీ సీ బస్సులు నడవలేని పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని పంచాయితీ రాజ్ ఏఈ దృష్టికి తీసుకెళ్లిన స్పందన లేదు. బీటీ రోడ్డు ఏర్పాటుతో ప్రజా రవాణా మెరుగుపడుతుందని అనుకున్న ప్రజలకు నిరాశే ఎదురైంది.

ఆగిన పనులను వెంటనే ప్రారంభించేందుకు చ ర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ప్రజలు వేడుకుంటున్నా రు. ఇదే విషయాన్ని ఏఈని కోరగా గుత్తేదారుకు వేరేచోట చేసిన పనులకు బిల్లులు రాక నే పనులు ఆపినట్లు తెలిపారు. పనులు త్వర గా ప్రారంభించేందుకు ఉన్నతాధికారుల దృ ష్టికి తీసుకెళ్తానని తెలిపారు.