calender_icon.png 22 May, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందజేసిన

15-05-2025 01:45:20 AM

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా భాధితుల మొబైల్ ఫోన్లను

 రికవరీ చేసిన పోలీస్ అధికారులు,సిబ్బందికి ప్రశంసలు

భద్రాద్రి కొత్తగూడెం మే 14 (విజయ క్రాంతి): జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న భాదితులకు సి ఈ ఐ ఆర్  పోర్టల్ ద్వారా రికవరీ చేసి బుధవా రం వాటిని తిరిగి బాధితులకు ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో  సీఈఐ ఆర్ పోర్టల్ ద్వారా అందుకున్న ఫిర్యాదులతో బాధితులు కోల్పోయిన మొబైల్ ఫోన్లను కనిపెట్టడం జరిగితుందన్నారు.

గత రెం డు నెలల వ్యవధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న 150 మంది భాధితులకు తిరిగి వారి ఫో న్లను అప్పగించడం జరిగిందన్నారం. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వెంటనే  సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా అడిగిన అన్ని రకాల వివరాలను కచ్చితంగా నమోదు చేసుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వారి మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి కనిపెట్టడం జరుగిందన్నా రు.

గడిచిన ఐదు నెలల కాలంలో ఇప్పటివరకు మొత్తం 743 మొబైల్ ఫోన్లను కనిపెట్టి భాదితులకు అందజేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి వారికి అందజేయడంలో కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ  అభినందించారు.

అనంతరం వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఐటి సెల్ ఇంచార్జి సీఐ రాము,ఎస్త్స్ర సురేష్ , ఐటి సెల్ సభ్యులు నవీన్,నరేష్,మహేష్,నరేన్ మరియు తదితరులు పాల్గొన్నారు.