15-05-2025 01:43:08 AM
కడ్తాల్, మే 14 : కడ్తాల్ పోలీస్ స్టేషన్ ను శంషాబాద్ డిసీపీ రాజేష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో సి బ్బంది యొక్క సమస్యలు, కేసుల వివరాలు, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా స్టేషన్ కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తిం చి వారి యొక్క సమస్యలు తెలుసుకొని దరఖాస్తు స్వీకరించి చట్టప్రకారం న్యాయం చే యాలని సూచించారు.
ప్రజలతో మర్యాద గా ప్రవర్తించి పోలీస్ యొక్క ఇమేజ్ పెంచి శాంతిభద్రతలను కాపాడాలని సూచించా రు. పెట్రోల్ మొబైల్ సిబ్బంది 100డయల్ స్వీకరించి త్వరగా సంఘటన స్థలానికి వెళ్లాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ గంగాధర్, ఎస్సై వరప్రసాద్ ఉన్నారు.