03-01-2026 12:00:00 AM
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ టౌన్, జనవరి 2: అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు కలసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్,కలెక్టరేట్ ఏఓ సువర్ణ రాజు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, నాల్గవ తరగతి ఉద్యోగ సంఘం నాయకులు జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తహశీల్దార్లు, టీఎన్జీవోస్ నాయకులు కలెక్టరేట్ రెవిన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్, ట్రెసా సమక్షంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కేక్ కట్ చేసి 2026 ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకున్నారు. జిల్లా అధికారులు సిబ్బంది కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ నూతన ఉత్సాహంతో నూతన సంవత్సరంలో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ యూనియన్ల క్యాలెండర్, డైరీలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు పరస్పరం తెలియజేశారు.