calender_icon.png 9 January, 2026 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా సరఫరాలో ఇబ్బందులు లేవు

03-01-2026 12:00:00 AM

మండల వ్యవసాయ అధికారి ఏ. డాకేశ్వర్  గౌడ్

చిన్నంబావి, జనవరి 2 : మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను శుక్రవారం నాడు మండల వ్యవసాయాధికారి ఏ. డాకేశ్వర్ గౌడ్ తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైనంత యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని అవసరం లేదన్నారు. మండలంలో యాసంగికి సాగు చేసే పంటల విస్తీర్ణాన్ని బట్టి మండలానికి 1850 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.

రైతులు తమ పట్టాదారు పాసు బుక్కు, ఆధార్ కార్డు తో యూరియా బస్తాలు పొదవచ్చని, యూరియా సరఫరా అనేది నిరంతర ప్రక్రియ కావున రైతులు సింగిల్ విండో సొసైటీ, ఆగ్రో సెంటర్స్ మరియు ప్రైవేట్ ఎరువుల దుకాణాలలో  తీసుకోగలరు. ఫర్టిలైజర్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.