02-05-2025 12:00:00 AM
జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు
కాటారం (భూపాలపల్లి), మే 1 (విజయక్రాంతి) : కార్మిక చట్టాల ఫలాలు అందరికి సమానంగా అందినప్పుడే మే డే లక్ష్యం నెరవేరినట్లని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజు అన్నారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక అంబెడ్కర్, కాకతీయ హమాలీ యూనియన్ ఆఫీస్ ల వద్ద మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. జడ్జి మాట్లాడుతూ కార్మికుల ఆరో గ్యం, భద్రత, పెన్షన్ చాల ముఖ్యమైనవని, అవి అందరికి అందాలన్నారు.
మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల, అడ్వొకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ జి. ప్రియాంక , కార్మిక సంఘాల నాయకులు సాయిలు, రమేష్, మహేందర్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.