calender_icon.png 3 May, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

02-05-2025 12:00:00 AM

డీవైఎస్‌వో రమాదేవి

సెలవుల్లో సెల్‌ఫోన్లకు పరిమితం కావొద్దు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే1 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర క్రీడ ప్రాధికార శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డివైస్‌వో రమాదేవి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో నెట్ బాల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలతో క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.సెలవుల్లో సెల్ ఫోన్లకు పరిమితం కాకుండా క్రమశిక్షణతో ఆటలు ఆడి భవిష్య త్తు కార్యాచరణను ఏర్పరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన క్రీడల అధికారి బండ మీనా రెడ్డి, క్యాంపు ఇన్చార్జి తిరుపతి, కోచ్ లు విద్యాసాగర్, అరవింద్, రవీందర్, రాకేష్, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.