10 June, 2026 | 3:14 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు పని భద్రత కల్పించాలి

12-02-2026 07:47 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం కామారెడ్డి మున్సిపల్ వాటర్ సెక్షన్ ఎదుట, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట, కామారెడ్డి జిల్లాలో సివిల్ సప్లై హమాలీలు, గోదాముల ముందు సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను యధావిధిగా కొనసాగించాలని కొత్తగా తీసుకొచ్చిన నాలుగు కోడ్లను వెంటనే తొలగించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అలాగే సుప్రీంకోర్టు జీవో ప్రకారం అనేసేవేతనం అమలు చేయాలని పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కార్మికుల కల్పించాలన్నారు. బ్యాంకింగ్, రవాణా, వైద్యము, విద్య, ఎల్ఐసి, రైల్వే, విద్యుత్, వంటి వాటిని కేంద్ర ప్రభుత్వము ప్రైవేటు కరణను ఆపాలని వారన్నారు.

పెరిగిన ధరలు అనుగుణంగా కార్మికులకు పని భద్రత కల్పించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు.ఎల్ దశరథ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి.పి. బాలరాజ్, ప్రభుత్వ ఆసుపత్రి కార్మిక నాయకులు. శ్రీనివాస్, రఫిక్ ,సునీత, పద్మ, లావణ్య, అనిత, మమత, ప్రవీణ్, రజిత, బాల్రాజ్, సంగమేశ్వర్, లక్ష్మి, కామారెడ్డి మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం లక్ష్మణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, వాదుల రాజిరెడ్డి, రాజు, సత్తయ్య, కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై హమాలీలు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు.