calender_icon.png 5 August, 2025 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే కార్మికుల సంక్షేమం

04-08-2025 01:33:18 AM

  1. కార్మిక చట్టాలను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వం 
  2. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోంది 
  3. పీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్ అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కార్మిక శాఖ సక్రమంగా అందిం చే విధంగా పీసీసీ లేబర్‌సెల్ విభాగం వాచ్‌డాగ్‌లా పనిచేస్తోందని తెలిపారు. కార్మికు లకు కనీస వేతన చట్టం అమలు చేసి కాంగ్రె స్ పార్టీ కార్మికుల పక్షాన నిలిచిందన్నారు.

ఆదివారం గాంధీభవన్‌లో పీసీసీ లేబర్‌సెల్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభు త్వం 44 కార్మిక చట్టాలను నాలుగు విభాలుగా విభజించి కార్మికులకు అన్యా యం చేసిందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను మోదీ నిర్వీర్యం చేస్తున్నారని, ఆదానీ, అంబానీలకు లబ్ధి చేకూర్చేలా చేస్తున్నారని ఆరోపించారు. దేశం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలని నెహ్రూ హయాంలో ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించారని,

ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకులను జాతీ యం చేయడంతోపాటు మరిన్ని ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించి కార్మికులకు ఉపాధి కల్పించారన్నారు. మోదీ ప్రభుత్వం కార్మిక సంఘాలు లేకుండా చేసి కార్మికుల వెన్ను విరిచారని ఆయన మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పీసీసీ లేబర్ సెల్ పోరాటం చేయాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం లేబర్‌సెల్ పనిచేస్తుందని తెలిపారు.