calender_icon.png 5 August, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్, హరీశ్‌లపై క్రిమినల్ చర్యలు!

04-08-2025 01:32:48 AM

-సిఫార్సు చేసిన కాళేశ్వరం కమిషన్ నివేదిక

-ఈటల రాజేందర్‌తోపాటు ఉన్నతాధికారుల పాత్రపైనా ప్రస్తావన

-ఇరిగేషన్ శాఖ అంచనాలకు గుడ్డిగా ఆమోదం

-క్యాబినెట్ సమగ్ర నివేదికను అందించనున్న అధ్యయన కమిటీ

- నేడు క్యాబినెట్ సమావేశంలో నివేదికపై చర్చ

- అధ్యయన కమిటీతో సీఎస్ సమీక్షా సమావేశం

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో చేటుచేసుకున్న అవినీతి ఆరోపణలపై ఏడాదిన్నరగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడనుంది. ఎట్టకేలకు ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన బాధ్యులు, దోషులు సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశం సందర్భంగా బయటపడనున్నా రు.

కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలన్ని మాజీ సీఎం కేసీఆ ర్, మాజీమంత్రి హరీశ్‌రావు ఆదేశాలతోనే జరిగినట్టు క మిషన్ నివేదికలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై తుది నివేదికను అధ్యయనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సోమవారం క్యాబినె ట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్న నేపథ్యం లో అధ్యయన కమిషన్ క్యాబినెట్ సమగ్రమైన సారాంశాన్ని అందించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదివారం అధ్యయ న కమిటీతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన భారీ అవకతవ కలు, నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని అధ్యయన కమిటీ తేల్చినట్టు సమాచారం. నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తోపాటు పలువురు ఉన్నతాధికారుల పాత్రపైనా కమిషన్ నివేదికలో స్పష్టంగా ప్రస్తావించినట్టు తెలిసింది.

మిషన్ నివేదిక ప్రకారం మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుల ప్రత్యక్ష ఆదేశాలతోనే కాళేశ్వరం నిర్మాణాలు జరిగాయని కమిషన్ స్ప ష్టంగా గుర్తించింది. అంతేకాకుండా ఇరిగేషన్ శాఖ పంపి న అంచనాలను గుడ్డిగా ఆమోదించడంలో నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హయాంలోని ఆర్థికశాఖ పూర్తిగా విఫలమైందని కమిషన్ అభిప్రాయపడింది.

ఆర్థికశాఖ కనీస బాధ్యతలు కూడా నిర్వర్తించలేదని, నీటిపారుదల శాఖతో పాటు ఆర్థిక శాఖలోనూ భారీ లోపాలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. సీఎస్ నేతృత్వంలోని అధ్యయన కమిటీ నేడు జరగనున్న క్యాబినెట్ భేటీలో ఈ అంశాలపై బ్రీఫ్ రిపోర్ట్‌ను సమర్పించనుంది. క్యాబినెట్ చర్చ అనంతరం, పూర్తి నివేదికను ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. బాధ్యులపై క్రిమినల్ చర్యలకు కమిషన్ సిఫార్సు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.