calender_icon.png 5 August, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ ఓబీసీ సభను జయప్రదం చేయండి

04-08-2025 01:34:55 AM

  1. 7న గోవాలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఈ నెల 7న గోవాలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియం లో జరిగే జాతీయ ఓబీసీ మహాసభకు దేశవ్యాప్తంగా ఓబీసీ ఉద్యోగులు కదిలి వచ్చి విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

ఆదివారం హైదరాబాదులోని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ర్ట కార్యాలయంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి డీ రమ ఆధ్వర్యం లో బీసీ ఉద్యోగుల సంఘం రూపొందించిన పోస్టర్‌ను జాజుల శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్రీయ ఒబిసి ప్రదాన కార్యదర్శి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ..

దేశవ్యాప్తం గా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై గోవాలో జరిగే మహాసభలో సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. ఈ మహాసభకు దేశంలోని 29 రాష్ట్రాల నుండి పదివేల మంది ఓబిసి ప్రతినిదులు పాల్గొంటారని, దేశంలోని అఖిలపక్ష బీసీ నేతలు హాజరవుతున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా జనాభా దామాషా ప్రకారం చట్టసభలలో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని, బీసీలపై విధించిన క్రిమిలేయరును రద్దు చేయాలని, బీసీ ఉద్యోగు లకు ప్రమోషన్లు రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌లపై చర్చించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ ప్రధాన కార్యదర్శి సచిన్ రాజోల్కర్ మాట్లాడుతూ..

ప్రతి సంవత్సరం ఓబీసీ రిజర్వేషన్లు అమలులోకి వచ్చినటువంటి రోజైనా ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభలను దేశంలోని అన్ని రాష్ట్రాలలో నిర్వహిస్తున్నామని ఈసారి పదో మహాసభను గోవా రాష్ర్టంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయ న తెలిపారు దేశంలో చారిత్రాత్మకంగా ఆయన తెలిపారు. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్‌గౌడ్, ప్ర ధాన కార్యదర్శి రమ మాట్లాడుతూ..

కేంద్ర ప్రభుత్వ, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్య క్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సం ఘం రాష్ర్ట కార్యవర్గ అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బిసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్, బీసీ ఉద్యోగ సంఘాల నేతలు రాధారాణి, వారా ల శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, మహేశ్ యాదవ్, అనురాధ, షమీమ్ సుల్తాన, మహేంద్ర సాగర్, రాజేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.