13-09-2025 03:03:31 AM
వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. నిరుద్యోగ దివ్యాంగులను ఉద్యోగులుగా మార్చడం, పారా క్రీడాకారులను విజేత లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం గా వికలాంగుల కార్పొరేషన్ నూతన చర్యలు తీసుకున్నదని తెలిపారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన బోర్డు సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్లు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకు, గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాలతో పాటు టీచర్ పోస్టులకు సంబంధించి దివ్యాంగులకు ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ పద్ధ్దతిలో ఏడాది పాటు కోచింగ్ అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సమావేశంలో సంబంధిత శాఖ డిప్యూటీ సెక్రటరీ సత్యనారాయణ, డైరెక్టర్ శైలజ, జీఎం ప్రభంజన్ రావు పాల్గొన్నారు.